Kesineni Nani: ఏపీ ఎన్నికలు దగ్గరపడే వేళ తెలుగుదేశం పార్టీకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీతో తెగదెంపులు చేసుకోనున్నారు. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనతో పాటు కొందరికి అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం.
విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం గట్టిగా సాగుతోంది. టీడీపీకు రాజీనామా చేయనున్నట్టు చెప్పిన కేశినేని నాని..తిరిగి విజయవాడ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిగాయి. కేశినాని నాని వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైనా షరతుల విషయంలోనే సందిగ్దత ఏర్పడుతోంది. నానితో పాటు పార్టీలో చేరనున్న మరి కొందరు టీడీపీ నేతలకు కూడా సీట్లు కేటాయించాలని కోరుతున్నట్టు సమాచారం.
విజయవాడ పార్లమెంట్ సీటుతో పాటు ఆ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుంచి కుమార్తె కేశినేని శ్వేత, విజయవాడ పశ్చిమం నుంచి మాజీ ఎమ్మెల్యే బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్లు స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావులకు టికెట్లు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఎంపీ సీటుతో పాటు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే కేశినేని నాని సూచించిన ఐదు స్థానాల్లో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. కేశినాని షరతులు వర్తిస్తాయా లేక షరతులు పక్కనబెట్టి వైసీపీ కండువా కప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also read: Rajyasabha Elections 2024: మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులు ఖరారు, గెల్చుకుంటుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook