Film shootings in AP: ఏపీలో సినిమా ఘాటింగ్స్‌కు అనుమతి.. పాటించాల్సిన నిబంధనలు

ఏపీలో సినిమా ఘాటింగ్స్‌కు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( AP govt ) ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ( APSFTVTDC MD Thumma Vijay kumar Reddy ) తెలిపారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సదరు చిత్ర నిర్మాణ సంస్థలు ఈ మార్గదర్శకాలు ( Guidelines for shootings ), స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.

Last Updated : Oct 8, 2020, 07:42 PM IST
Film shootings in AP: ఏపీలో సినిమా ఘాటింగ్స్‌కు అనుమతి.. పాటించాల్సిన నిబంధనలు

అమరావతి : ఏపీలో సినిమా ఘాటింగ్స్‌కు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( AP govt ) ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ( APSFTVTDC MD Thumma Vijay kumar Reddy ) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ప్రభుత్వ స్థలాలు, పబ్లిక్ ప్లెసెస్‌లో సినిమా ఘాటింగ్స్ నిర్వహించుకొనేందుకు అవసరమైన అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందని, చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. Also read : Mirzapur 2 trailer: నెం.1లో ట్రెండ్ అవుతోన్న సస్పెన్స్ థ్రిలర్ మీర్జాపూర్ సీజన్ 2 ట్రైలర్

కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ ( COVID-19 lockdown ) విధించిన కారణంగా రాష్ట్రంలో సినిమా ఘాటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందేనని.. ఐతే ఆగస్టు 21న భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలు, స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు ( SOP ) అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందని తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. 

సినిమాల చిత్రీకరణ సమయంలో సదరు చిత్ర నిర్మాణ సంస్థలు ఈ మార్గదర్శకాలు ( Guidelines for shootings ), స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ( Wearing masks ) ఉందని, ఐతే కేవలం కెమెరా ముందుకొచ్చే సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఇవ్వడం జరిగిందని అన్నారు. Also read : Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్

సినిమాల చిత్రీకరణ  సమయంలో సినిమా చిత్రీకరణ పరికరాలు, సెట్లు అన్నీ కూడా తరచుగా శానిటైజ్ ( Sanitization ) చేయాల్సి ఉంటుందన్నారు.  చేతులు కడుక్కునే సౌకర్యం లేని పక్షంలో టెక్నీషియన్స్, నటీనటులు హ్యాండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితులలో తప్పించి మిగతా అన్ని సమయాల్లో టెక్నీషియన్స్ అందరూ ఆరు అడుగుల దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. 

ఇక సినిమా థియేటర్లు ప్రారంభించిన అనంతరం థియేటర్లలో పాటించాల్సిన నిబంధనల విషయానికొస్తే.. కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరంగ సందేశాన్ని సినిమా ప్రారంభం, ఇంటర్వెల్ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. భౌతిక దూరం పాటించేలా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. 
సినిమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులు, నియమ, నిబందనలు, ఇతర వివరాలను రాష్ట్ర ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in లో పొందవచ్చని ఆయన సూచించారు. Also read : 
CBI Raids: ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు, కొనసాగుతున్న సోదాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News