Mirzapur 2 trailer: నెం.1లో ట్రెండ్ అవుతోన్న సస్పెన్స్ థ్రిలర్ మీర్జాపూర్ సీజన్ 2 ట్రైలర్

ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోస్‌లో మీర్జాపూర్ సీజన్ 2 ట్రైలర్ ( Mirzapur season 2 trailer ) ఒకటి. 2018 నవంబర్‌లో విడుదలైన మీర్జాపూర్ సీజన్ 1 వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. రెండు రోజుల క్రితమే విడుదలైన మీర్జాపూర్ 2 ట్రైలర్‌కి నెటిజెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. యూట్యూట్ ట్రెండింగ్ వీడియోస్‌లో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి. 

Last Updated : Oct 8, 2020, 06:03 PM IST
Mirzapur 2 trailer: నెం.1లో ట్రెండ్ అవుతోన్న సస్పెన్స్ థ్రిలర్ మీర్జాపూర్ సీజన్ 2 ట్రైలర్

ప్రస్తుతం సినిమాలకు సమాంతరంగా వెబ్ సిరీస్‌లు ( Web series ) హిట్ అవుతున్నసంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోస్‌లో మీర్జాపూర్ సీజన్ 2 ట్రైలర్ ( Mirzapur season 2 trailer ) ఒకటి. 2018 నవంబర్‌లో విడుదలైన మీర్జాపూర్ సీజన్ 1 వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. రెండు రోజుల క్రితమే విడుదలైన మీర్జాపూర్ 2 ట్రైలర్‌కి నెటిజెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు 17 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ యూట్యూట్ ట్రెండింగ్ వీడియోస్‌లో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ( Mirzapur mafia ) అక్కడి మాఫియా సాగించే అరాచకాలు, రివేంజ్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. Also read : Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్

మీర్జాపూర్ సీజన్ 1 పూర్తయినప్పటి నుంచే వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ని వెంటాడుతూ వచ్చిన ప్రశ్న ఏదైనా ఉందా అంటే అది మీర్జాపూర్ సీజన్ 2 ఎప్పుడు విడుదలవుతుందనేదే. ఇప్పుడు వారికి సమాధానం లభించింది. మీర్జాపూర్ 2 సీజన్ అక్టోబర్ 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. 

పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శ్వేత త్రిపాఠి శర్మ, రసిక దుగల్, హర్శిత శేఖర్ గౌర్, అమిత్ సియల్, అంజుం శర్మ, షీబా చద్దా, మను రిషి చద్దా, రాజేష్ తైలంగ్, విజయ్ వర్మ, ప్రియాంశు పైన్యులి, ఇషా తల్వార్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. Also read : Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’

గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌ని ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఫరాన్ అఖ్తర్, రితేష్ సిధ్వాని ( Farhan Akhtar, Ritesh Sidhwani ) నిర్మిస్తున్నారు. ఓటిటి ప్లాట్‌ఫామ్ అమేజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ విబ్ సిరీస్ విడుదల కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News