AP Sankranti 2023 Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. 2023 సంక్రాంతి సెలవులలో మార్పు!

AP Govt announces Sankranti 2023 Holidays Re Schedule. ఏపీ 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సెలవులను జనవరి 12 నుంచి 17 వరకు ఉంటాయని ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 7, 2023, 10:38 AM IST
  • ఏపీ విద్యార్థులకు అలర్ట్
  • 2023 సంక్రాంతి సెలవులలో మార్పు
  • స్కూళ్లకు 6 రోజుల సెలవులు
AP Sankranti 2023 Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. 2023 సంక్రాంతి సెలవులలో మార్పు!

 2023 Sankranti Holidays starts from January 12 for Schools in AP: ఏపీ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులలో ఏపీ పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పు చేసింది. సంక్రాంతి సెలవులను జనవరి 12 నుంచి 17 వరకు ఉంటాయని ప్రకటించింది. అంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్ కంటే ఒకరోజు ఆలస్యంగా సెలవులు ఆరంభం అయి.. ఓ రోజు లేటుగా ముగియనున్నాయి. 

2023 జనవరి 17వ తేదీన ముక్కనుమ పండగ ఉంది. జనవరి 17న సెలవు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించాయి. ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ ముందుగా ప్రకటించిన సెలవులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ విద్యాశాఖ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2023 సంక్రాంతి సెలవులు స్కూళ్లకు జనవరి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. స్కూళ్లకు 5 రోజులు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవులు జనవరి 13న ప్రారంభమయి 17 వరకు కొనసాగుతాయి. తిరిగి 18న విద్యాసంస్థలు తెరుచుకుంటాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి సెలవులు ప్రారంభం అయి 15న ముగుస్తాయి. భోగి పండుగ రెండో శనివారం, సంక్రాంతి ఆదివారం రోజున వచ్చాయి. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు అదనంగా రెండు సెలవులు కోల్పోయారు. 

Also Read: TS Sankranti 2023 Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు 5, కాలేజీలకు 3రోజుల సెలవులు!

Also Read: AP Group-2 Papers: గ్రూప్ 2 పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు.. ఉత్తర్వులు జారీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News