APPSC Recruitment : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. రెవిన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా దరఖాస్తు గడువును జనవరి 29 తేదీ వరకు పొడిగించారు. అలాగే జనవరి 28 తేదీ అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ (APPSC) పేర్కొంది. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోస్టుల వివరాలు..
* పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ శాఖ):
► పోస్టుల సంఖ్య: 670
►అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు పాస్ అవ్వాల్సి ఉంటుంది.
► వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read: AP Schools Latest News : ఏపీలో పాఠశాలలను కొనసాగించడానికి కారణం అదే
* పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3(ఎండో మెంట్స్ సబ్ సర్వీస్):
►పోస్టుల సంఖ్య: 60
►అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
► వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
►ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం :
►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
►ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021
►ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.01.2022
► ఫీజు చెల్లింపు చివరి తేదీ : 28.01.2022
►పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook