అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహళలు పోరాటం చేస్తున్నారని, ఉద్యమంలో వారి ఆవేదన కలిచి వేస్తుందన్నారు బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి. మహిళల పట్ల ప్రభుత్వ, పోలీసుల తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. 144 సెక్షన్ ఎప్పుడు అమలుచేయాలో, ఎప్పుడు వాడకూడదో తెలియదా అని ప్రశ్నించారు. రాజధానిని కాపాడుకోలేకపోతే దేశం విడిచి మరో దేశానికి శరణార్థులుగా వెళ్లిపోవడం మంచిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఈ పదవులు ఎందుకని అసహనం వ్యక్తం చేశారు.
రాజధాని విషయంలో న్యాయం జరిగేలా చూడకపోతే పదేళ్లు తాను ఎంపీగా ఉండి ఉపయోగం ఏముంటుందన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడమే కాదు, వారిని కులాలు అడిగి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలు ఏమైనా ఉండని, రాజధానికి బీజేపీ కచ్చితంగా సహకరిస్తుందని తెలిపారు.
అమరావతిలో అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ కూర్చోలేనని, అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చుండిపోదని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలకు రాని అనుమతులు అధికార వైఎస్సార్ సీపీ ర్యాలీలకు మాత్రం ఎలా వస్తున్నాయని ఈ సందర్భంగా సుజనా చౌదరి ప్రశ్నించారు. ఇక్కడి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం అనుక్షణం గమిస్తుందని, డీజీపీ అధికార పార్టీ తొత్తుగా మారితే ఆయన సమస్యలు ఎదుర్కోవడం తప్పదన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..