చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలి: టీజీ భరత్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేయాలని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భారత్ వ్యాఖ్యానించారు.

Last Updated : Aug 5, 2018, 07:14 PM IST
చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలి: టీజీ భరత్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేయాలని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భారత్ వ్యాఖ్యానించారు. అమరావతితో సమానంగా కర్నూలు అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. భరత్ పుట్టినరోజు సందర్బంగా నగరంలోని క్రీడా మైదానంలో టీజీబీ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలు నుంచి సీఎం పోటీ చేస్తే కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పార్టీ గెలుస్తుందన్నారు. అలా కాని పక్షంలో ఇక్కడ సర్వే ప్రకారం సీటు కేటాయించాలని భరత్ కోరారు. కాగా ఇటీవలే మంత్రి నారా లోకేశ్‌ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, లోక్‌సభ స్థానాన్ని బుట్టా రేణుకకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజీ భరత్ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయంశంగా మారాయి.

Trending News