Jagananna Animutyalu Prize Money: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించి, ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చి డిజిటల్ విద్యను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతూ రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు "జగనన్న ఆణిముత్యాల" అవార్డుల పేరుతో ప్రభుత్వం సత్కరించనుంది. వీరితో పాటు ఉన్నత విద్యలో 5 కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు "స్టేట్ ఎక్స్ లెన్స్ అవార్డులు" కూడా ప్రదానం చేయనుంది.
మంగళవారం విజయవాడ 'ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులను ఘనంగా సత్కరించనున్నారు. 10వ తరగతిలో కేటగిరీ వారీగా (జెడ్పీ, మున్సిపల్, మోడల్, ట్రైబల్/సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ తదితర) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పాఠశాల స్థాయిలో ప్రతి స్థాయిలో మొదటి 3 ర్యాంకులు వచ్చిన వారికి ప్రభుత్వం అవార్డులు అందజేయనుంది. ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి గ్రూపులో మొదటి ర్యాంక్ సాధించిన.. నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా ప్రతి టాప్ ర్యాంక్ సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు "జగనన్న ఆణిముత్యాలు" పేరుతో ప్రోత్సాహం అందజేయనుంది.
2022-23 పదో తరగతి పరీక్షల్లో పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తొలి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి జూన్ 19 వరకు సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇప్పటికే నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి సంబంధిత విద్యాసంస్థలకు మెమెంటోతో పాటు ప్రభుత్వం సన్మానించింది. ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరిస్తోంది. ప్రతి విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికెట్, మెడల్ అందజేయనుంది.
జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలు ఇలా..
==> పదో తరగతి రాష్ట్రస్థాయిలో నగదు పురస్కారం ప్రథమ రూ.లక్ష, ద్వితీయ 75 వేలు, తృతీయ 50 వేలు (42 మంది విద్యార్థులకు)
==> జిల్లా స్ధాయి నగదు పురస్కారం ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ 30 వేలు, తృతీయ 15 వేలు (విద్యార్థులు–609)
==> నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం ప్రథమ రూ.15 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ 5 వేలు (విద్యార్థులు–681
==> పాఠశాల స్థాయిలో ప్రథమ రూ.3 వేలు, ద్వితీయ రూ.2 వేలు, తృతీయ రూ.వెయి– (విద్యార్థులు 20,299)
==> ఇంటర్మీడియట్ రాష్ట్ర స్ధాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు నగదు పురస్కారం రూ.లక్ష, (విద్యార్థులు 26)
==> జిల్లాస్థాయిలో గ్రూపుల వారీగా.. రూ.50 వేలు (విద్యార్థులు 391)
==> నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా.. రూ.15 వేలు, (విద్యార్థులు 662)
==> మొత్తం విద్యార్థుల సంఖ్య–22,710
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook