Cm Ys Jagan: 2024 ఎన్నికలకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం వైఎస్ జగన్

2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 01:10 PM IST
  • వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ విస్తృతస్థాయి సమావేశం
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్
  • విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్‌
Cm Ys Jagan: 2024 ఎన్నికలకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం వైఎస్ జగన్

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచ్చించారు. ప్రత్యర్థి పార్టీలకు అందకుండా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటు..మంత్రివర్గ విస్తరణ..కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, ఇంఛార్జ్‌ మంత్రులు..ఇలా అన్ని అంశాల్లో సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇవాళ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే ప్రభుత్వం..పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులు చేపట్టారు సీఎం జగన్. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ నేతలతో సీఎం జగన్‌ భేటీ కాబోతున్నారు. పార్టీలో బాధ్యతలు అప్పగించిన నాయకులందరితోనూ సీఎం జగన్‌ సమావేశం నిర్వహించబోతుడడంతో వైసీపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎన్నికలే లక్ష్యంగా సీఎం వైఎస్‌ పార్టీ నేతలకు..శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రీజినల్‌, జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారికి నియోజకవర్గాల వారిగా టార్గెట్‌ ఫిక్స్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ వునర్‌వ్యవస్థికరణలో భాగంగా పార్టీలో చెలరేగిన అసంతృప్తులపై సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారు. అలాగే పార్టీలో ఎవరైనా నేతలు గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో ఏ టైంలో అయినా ఎలక్షన్‌లు వచ్చే అవకాశం ఉందనే విధంగా సీఎం వైఎస్ జగన్‌ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశస్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో..ఏ క్షణమైనా ఎలక్షన్‌లు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు  సీఎం జగన్‌ సూచించనున్నారు. నిజయోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు పట్ల వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలిందని సమాచారం. నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ వార్నింగ్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికలకు పార్టీ నేతల సమన్వయంతో పనిచేసి ముందుకెళ్లేలా కార్యచరణను సీఎం వైఎస్ జగన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారానికి కనీసం 10 నుంచి 15 గ్రామ..వార్డు సచివాలయాలను సందర్శించి..వాటి పనితీరుపై సమీక్షలు జరిపేలా కార్యక్రమాలను రూపొందించారు సీఎం జగన్. వచ్చే నెల 2వ తేదీ నుంచి గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఇవాళ జరగబోయే పార్టీ విస్తృస్ధాయి సమావేశంలో సీఎం జగన్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సీఎం వైఎస్‌ జగన్‌ త్వరలో జిల్లాల్లో పర్యటనలు చేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాజకీయాల్లో కీలకంగా మారిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో వైసీపీతో సంబంధాలపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించబోయే సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ నేతలకు సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారోనని నేతల్లో ఉత్కంఠ రేపుతోంది.
 

Also Read: Ganesh Puja Tips: బుధవారం గణపతి పూజ... ఈ నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి...  

Also Read: Patel vs Parag: పటేల్, పరాగ్‌ల మాటల యుద్ధం, ఒకరిపై మరొకరు దూసుకుపోయి...

Also Read: Tamilnadu: తమిళనాడులో ఘోర విషాదం... రథోత్సవంలో విద్యుత్ షాక్‌తో 11 మంది మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News