జీఎస్‌టీ విచారణకు రెండో సారి వర్మను పిలిచారా ?

Last Updated : Feb 23, 2018, 11:32 AM IST
జీఎస్‌టీ విచారణకు రెండో సారి వర్మను పిలిచారా ?

జీఎస్‌టీ షార్ట్ ఫిల్మ్ వివాదంపై డైరక్టర్ వర్మను సైబర్ క్రైం పోలీసుల ముందు హాజరుకావాడంపై సంసిద్ధత నెలకొంది. ఇటీవల సీసీఎస్ లో విచారణ హాజరైన వర్మ ను మరోసారి శుక్రవారం సైబర్‌ క్రైం ముందు హాజరు కావాలని  పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. వ్యక్తిగత పనుల కారణంగా తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని..కాబట్టి శుక్రవారం రోజు తను విచారణకు హాజరుకాలేని పోలీసులకు వర్తమానం పంపినట్లు మీడియాలు కథనాలు ప్రచారమయ్యాయి.

అయితే ఈ వార్తలను వర్మ ఖండిస్తున్నారు. అసలు  రెండో సారి పోలీసులు పిలువలేదని వెల్లడించారు.  సీసీఎస్‌ పోలీసులు తనను శుక్రవారం విచారణకు పిలిచినట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

జీఎస్‌టీ వివాదం నేపథ్యంలో  తొలి విచారణ  తరువాత వర్మ ల్యాప్ టాప్ సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆ ల్యాప్ టాప్  ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంది. ఫోరెన్సిక్ నివేదిన అనంతరం వర్మపై పోలీసులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే వర్మకు తెలిపినట్టు సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి

Trending News