రాజకీయాల్లో అందరిదీ ఓ వైఖరైతే..జగన్ ( Jagan ) వైఖరి మరోలా ఉంటుంది. ఒకసారి ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఇక అంతే..ఆరు నూరైనా చేసి తీరాల్సిందే. మూడు రాజధానుల అంశం ( Three capital issue ) పై మరోసారి ఇదే స్పష్టత ఇచ్చేశారు జగన్.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ap cm ys jaganmohan reddy ) రాజకీయాల్లో..పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో గానీ..వినూత్న నిర్ణయాలు తీసుకోవడంలో గానీ వెనక్కి తగ్గడం లేదు. అన్నింటికంటే ఎక్కువగా రాష్ట్రానికి మూడు రాజధానుల ఆలోచనతో దేశమంతా తనవైపు చూసేలా చేశారు. నిజంగానే వినూత్న ఆలోచన. అయితే దీనిపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తూ..కోర్టును ఆశ్రయించి అడ్డంకుల్ని సృష్టించింది. ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టుల్లో ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది. స్టే వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ అభ్యర్ధనను కోర్టు కొట్టివేసింది. అయినా సరే..వైఎస్ జగన్ మాత్రం తన మాటపైనే ఉన్నారని మరోసారి స్పష్టమైంది.
జాతీయ ఛానెళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే స్పష్టం చేశారు వైఎస్ జగన్ ( ys jagan ). పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని జగన్ స్పష్టం చేశారు. అలా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కచ్చితంగా ఏపీ మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. Also read: AP: మద్యం వినియోగంలో 65 శాతం తగ్గుదల