Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూ లీడర్‌గా ఓ వెలుగువెలిగారు మాజీమంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీకి పెద్దదిక్కులా ఉన్న పెద్దిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా సేవలందించారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక కీలక నేతలంతా పార్టీకి బైబై చెప్పినా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం జగన్‌కు తోడుగా ఉంటూ వచ్చారు. తాజాగా జగన్‌కు పెద్దిరెడ్డికి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ బద్వేల్ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టినట్టు సమాచారం.
Also Read: KTR: బరాబర్ జైలుకు పోతా.. రేవంత్ రెడ్డి అయ్యకు కూడా భయపడను
ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదట. అందుకే ఆయన జగన్‌పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈ విషయం ప్రత్యక్షంగా తెలిపేందుకు ఆయన జగన్ బద్వేల్ పర్యటనకు డుమ్మా కొట్టినట్టు సమాచారం. సాధారణంగా జగన్ పర్యటనలో పెద్దారెడ్డి తప్పక ఉండేలా ప్రయత్నిస్తారు. ఒకవేళ ఏదైనా పర్యటనకు వెళ్లాల్సి ఉన్న తన షెడ్యూల్‌ను మార్చుకుంటారు.. కానీ ఇప్పుడు మాత్రం కావాలనే జగన్ పర్యటనకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఇంతలా నరాజ్ కావడం వెనుక బలమైన కారణమే ఉందని పెద్దిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు. అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించడంపై పెద్దిరెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ టూర్‌కు డుమ్మా కొట్టిన పెద్దిరెడ్డి కుటుంబం షిరిడీ పర్యటనకు వెళ్లడం హాట్‌టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం కడప, కర్నూలు జిల్లా కో ఆర్డినేటర్‌గా తనను నియమించినా ఏ లాభం లేదని పెద్దిరెడ్డి భావిస్తున్నారట. కడప జిల్లా మొత్తం జగన్ రెడ్డి అడ్డగా చెబుతారు. అలాంటి చోట జగన్‌ను కాదని, తాను ఏ నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి ఉద్దేశంగా ఉందని చెబుతున్నారు. మొదటి నుంచి కడప జిల్లా రాజకీయాలన్నీ జగన్ రెడ్డి లేదంటే ఎంపీ అవినాష్ రెడ్డే చూస్తుంటారు. ఇతరుల్ని వారు వేలు పెట్టనివ్వరు. అలాంటప్పుడు తనకు ఉమ్మడి కడప జిల్లా బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని పెద్దిరెడ్డి అనుకుంటున్నట్టు తెలిసింది.
మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఆ నేతలంతా జగన్‌కు చాలా క్లోజ్‌గా ఉంటారు. అలాంటి చోట తాను చెప్పినా వినే పరిస్థితి ఉండదని పెద్దిరెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. మొత్తంగా తన అసంతృప్తి, ఆవేదనను తెలిపేందుకే జగన్ పర్యటనకు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. అయితే అసంతృప్తితో రగిలిపోతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ రెడ్డి ఎలా కూల్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Dhanteras 2024 : 100 రూపాయలు ఉంటే చాలు..ధనత్రయోదశి రోజు బంగారం కొనే ఛాన్స్..ఎక్కడ..ఎలాగో తెలుసా?