Godavari Floods: గోదావరి ఉప నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా శబరి, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని నదులనుంచి పెద్దఎత్తున వరద ముంచుకొస్తుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దఎత్తున వరద ముంచుకొస్తోంది. గోదావరి ఉప నదులైన ఇంద్రావతి, కిన్నెరసానితో పాటు భద్రాచలం దిగువన శబరి నుంచి కూడా పెద్దఎత్తున వరద నీరు గోదావరిలో వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 52.70 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తి వచ్చిన నీరు వచ్చినట్టే సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 15 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుండటంతో ఇప్పటికే భద్రాచలం, ఏపీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి మీదుగా గోదావరి ప్రవహిస్తోంది. వాజేడు, వెంకటాపురం, భద్రాచలానికి ఏపీలోని కూనవరం, చింతూరు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి.
ఇక ధవళేశ్వరం దిగువన కోనసీమలోని లంక గ్రామాలు చాలావరకు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాస్తవానికి గత వారం రోజులు పైనుంచి కోనసీమలో ఇదే పరిస్థితి ఉంది. మధ్యలో 4 నాలుగు రోజులు రెండో ప్రమాద హెచ్చరిక తొలగించినా తిరిగి వరద ఉధృతి పెరిగిపోయింది. భారీగా వస్తున్న వరద ఉధృతితో నదీ కోనసీమ లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద ఉధృతి నెమ్మదిగా పెరుగుతోంది.
Also read: Big Breaking News: తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook