AP Free Bus Scheme: ఎన్నికల ప్రచారంలో అనేక హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ హామీల అమలుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హామీల్లో ప్రధానమైన దానిని నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం మహిళల అందరికీ ప్రకటించిన ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఉచిత బస్సు రవాణా పథకం అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు.
Also Read: Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన స్టైల్లో పని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాధ్యతలు చేపట్టిన తొలిసారి గురువారం విజయవాడలోని బస్టాండ్‌ను పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజలతో ఆర్టీసీ సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనం చేసేందుకు 15 రోజుల్లోగా ఒక కమిటీని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
అధ్యయనం
ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉన్న తెలంగాణతోపాటు కర్ణాటకలో కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సమర్పించిన నివేదికను పరిశీలిస్తామన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని చెప్పారు. దీంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సంఖ్య పెంచుతామని, విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి వివరించారు.
అమలు ఎలా?
అయితే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలులో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణలో అయితే కేవలం ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేయడమే కాకుండా, ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మరి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అందరికీ మేలు చేసే విధంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తారా? లేక తెలంగాణలో ఉన్నది ఉన్నట్టు అమలు చేస్తారనేది చర్చ జరుగుతోంది. మంత్రి ప్రకటన చూస్తుంటే ఉచిత బస్సు పథకం అమలుకు దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter