కొత్త సీఎం జగన్ కు సరికొత్త కాన్వాయ్ కేటాయింపు !!

Last Updated : May 24, 2019, 12:36 PM IST
కొత్త సీఎం జగన్ కు సరికొత్త కాన్వాయ్ కేటాయింపు !!

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న వైసీపీ... కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం లాంఛనమే. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా ప్రభుత్వం కాబోయే సీఎం జగన్ కు  కొత్త కాన్వాయ్ కేటాయించింది. జగన్ కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఉంటాయి. ఏపీ 18పీ 3418 నెంబర్ తో ఆరు కొత్త వాహనాలు కేటాయించినట్లు తెలిసింది

కాబోయే  సీఎంగా వైఎస్  జగన్ నివాసం వద్ద భద్రత పెంచారు. ఆయన నివాస పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోని తీసుకున్న పోలీసులు.. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్ నివాసముంటున్న తాడేపల్లిలో పోలీసులు ఆంక్షలు విధించారు.

Trending News