జగన్ పై దాడి కేసులో కీలక మలుపు ; ఎన్ఐఏకు బదిలీ చేసిన హైకోర్టు

రాజకీయంగా దుమారం రేగిన జగన్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది

Last Updated : Jan 4, 2019, 12:18 PM IST
జగన్ పై దాడి కేసులో కీలక మలుపు ; ఎన్ఐఏకు బదిలీ చేసిన హైకోర్టు

వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేట్ ఏజేన్సీ (NIA) కు బదిలీ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎయిర్ పోర్టు పరిధిలో జరిగిన ఘటనను రాష్ట్రపోలీసులు విచారించడం తగదని..అందకే ఈ కేసునుNIAకు బదిలీ చేయాల్సి వచ్చిందని కోర్టు వెల్లడించింది. కేసు ఆలస్యమైతే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశముందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించగా.. ఈ వాదనతో ఏకీభవించి కోర్టు ఈ మేరుకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో కుట్ర కోణం కూడా దాగి ఉందన్నన్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు..ఈ కోణంలో ఎందుకు విచారణ జరపలేదని ఏపీ పోలీసులను ప్రశ్నించినట్లు తెలిసింది.

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోస్టులో జగన్ పై శ్రీనివాస్ రావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రస్తుతం పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు. జగన్ సీఎం కావాలనే నిందితుడు ఈ దాడి చేసినట్లు చెబుతున్నాడు. ఈ కేసును అనేక కోణాల్లో విచారించిన ఏపీ పోలీసులు.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని..సంచలనం కోసమే నిందితుడు ఇలాంటి దాడికి పాల్పడ్డని పోలీసులు నిర్ధారించారు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. తాజా హైకోర్టు తీర్పుతో ఈ కేసు మలుపులు తిరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Trending News