Tirupati Stampede: తిరుపతి ఘటనలో తప్పెవరిది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో తేడా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘోరమైన తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు కోరారు. ఈ ఘటనకు ఈవో, ఏఈవోలే బాధ్యులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2025, 07:19 PM IST
Tirupati Stampede: తిరుపతి ఘటనలో తప్పెవరిది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో తేడా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఏపీ ప్రభుత్వం టీటీడీ అధికారుల్నే బాధ్యుల్ని చేస్తోంది. పాలకమండలిని మాత్రం మినహాయిస్తోంది. తొక్కిసలాటకు కారణం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకన్న చౌదరి అని పవన్ కళ్యాణ్ చెబుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మరో ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత టీటీడీ ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకన్న చౌదరి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఇద్దరే బాధ్యత వహించాలని తెలిపారు. ఇక పోలీసులు మాత్రం పూర్తిగా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. తక్షణం టీటీడీలో ప్రక్షాళన జరగాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ ఇద్దరు అధికారుల మధ్య పడటం లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. అంతేకాకుండా పోలీసులు కొందరు కావాలనే ఇలా చేసినట్టుగా తనకు ఫిర్యాదులు అందాయన్నారు. ఇక అభిమానులు, పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాథ్యతగా వ్యవహరించరా అంటూ మండిపడ్డారు. పోయిన ప్రాణాలు తీసుకురాలేమని, తప్పు జరిగిపోయిందని, క్షమించాలని పవన్ అభ్యర్ధించారు. 

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జరిగిన ఘటనకు మరో ఇద్దరు అధికారుల్ని బాద్యుల్ని చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీఎస్ఓ శ్రీధర్‌లపై బదిలీ వేటు వేశారు. 

స్థూలంగా చెప్పాలంటే తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయాల్లో స్పష్టమైన బేధం కన్పిస్తోంది. ఘటనకు బాధ్యులుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్న ఇద్దరు ఉన్నత స్థాయి అధికార్లపై చంద్రబాబు వేటు వేయకపోవడం గమనార్హం

Also read: PF Account Big News: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా, ఇలా చేస్తే 2.5 కోట్ల ఫండ్, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News