Heavy Rains: రానున్న 48 గంటలు..ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2021, 09:58 AM IST
Heavy Rains: రానున్న 48 గంటలు..ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. 

వాయవ్య బంగాళాఖాతంలో(Bay of Bengal)పశ్చిమ బెంగాల్ సముద్రతీరానికి సమీపంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు ఐఎండీ తెలిపింది. దీని కారణంగా ఇవాళ వాయవు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ(IMD)పేర్కొంది. అల్పపీడనం కారణంగా రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడనున్నాయి.ఇవాళ విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ, రేపు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. గత 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మ లక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8 సెంటీమీటర్ల చొప్పన వర్షపాతం నమోదైంది. అల్పపీడనం(Low Depression) కారణంగా తూర్పు, విశాఖ జిల్లాల్లో భారీ వర్షసూచన(Heavy Rains)జారీ అయింది. 

Also read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News