Vandebharat Express: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నడుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ఉన్న రెండు రైళ్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో మరో మూడు రైళ్లుకు దాదాపుగా ఆమోదం లభించనట్టు తెలుస్తోంది. కొత్తగా మూడు రైళ్లను ఏయే మార్గాల్లో ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికే రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో ఒకటి విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య అయితే మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్యన నడుస్తోంది. ఈ రెండు రైళ్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఆక్సుపెన్సీ కూడా దాదాపుగా ఫుల్ ఉంటోంది. ఇప్పుడు మరో మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ గతంలోనే సూతప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తయింది.
కాచిగూడ-బెంగళారు, విజయవాడృ-చెన్నై మార్గాల్లో కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆమోదం లభించింది. ఈ రెండూ కాకుండా మూడవది విశాఖపట్నం నుంచి తిరుపతికి కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పటికే మంచి ఆదరణ ఉంది. అటు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌కు కూడా ఆదరణ బాగుంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రస్తుతం 9 సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తుండగా అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు కచ్చితంగా ఉంటూ వస్తోంది. అందుకే విశాఖపట్నం నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుందనేది రైల్వే అధికారుల అంచనా. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్లేలా రూట్ ఖరారు చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తిరుపతికి 12 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు ఈ మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభిస్తే ప్రయాణ సమయాన్ని చాలా వరకూ తగ్గించవచ్చు. తద్వారా ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభిస్తే విశాఖ-తిరుపతి మద్య ప్రయాణ సమయాన్ని 9-10 గంటలుండవచ్చు. ఇది కాకుండా మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
Also read: Rains Alert: ఏపీలో రానున్న మూడ్రోజులు విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook