ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరికొత్త విప్లవం ; జనసేన ఆధ్వర్యంలో రెడ్ రివల్యూషన్ కార్యక్రమం

                                                       

Last Updated : Aug 8, 2018, 02:30 PM IST
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరికొత్త విప్లవం ; జనసేన ఆధ్వర్యంలో రెడ్ రివల్యూషన్ కార్యక్రమం

సమస్యలపై పోరాడేందుకు ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఓ వినూత్న కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను జనసేన కార్యకర్త తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి.. ఈ రెడ్ రివల్యూస్ అని అనుకుంటున్నారా..? అయితే  వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది...

రెడ్ రివెల్యూషన్ అంటే...?
స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ' రెడ్ రివాల్స్యూషన్' కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు, జనసేన కార్యకర్తలు జనాల్లోకి తిరుగుతూ ప్రజలతో చర్చించి సమస్యలను గుర్తిస్తారు. వాటిని  వీధి గొడపై ఎరుపు రంగులో వేసి అక్షర రూపంలో తెలియజేస్తారు. 

సొంత ఊరు నుంచి ప్రారంభం
తొలుత ఈ రెడ్ రివల్యూషన్ కార్యక్రమాన్ని పవన్ సొంత ఊరు ప.గో జిల్లా నిడదవోలు నియోజకవర్గం కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిదడవోలు నియోజకవర్గంలో పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రజా సమస్యలను ఎర్ర రంగుతో గోడపై ముద్రించారు. ఈ కార్యక్రమం జనసేన నేత కస్తూరి సత్యప్రసాద్ ఆధర్యంలో జరిగింది. సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇది కార్యక్రమం దోహదపడుతుందని సత్య ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం సక్స్స్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా కార్యక్రమాలు చేపట్టాలని జనసేన భావిస్తోంది.

 

 

Trending News