సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా భారీ సభ పెడతాం: పవన్ కళ్యాణ్

భారత దేశంలోని ప్రతి పౌరుడికి జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) వర్తిస్తుందని, కేవలం ఒక వర్గం కోసం పెట్టింది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించిన ఆయన, సమావేశానికి 

Updated: Jan 27, 2020, 07:02 PM IST
సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా భారీ సభ పెడతాం: పవన్ కళ్యాణ్

అమరావతి: భారత దేశంలోని ప్రతి పౌరుడికి జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) వర్తిస్తుందని, కేవలం ఒక వర్గం కోసం పెట్టింది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించిన ఆయన, సమావేశానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తలు హాజరయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలతో పాటు రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై కార్యకర్తల అభిప్రాయాలను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.  

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీ ల వల్ల పౌరసత్వం తీసేస్తారని ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. మత ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 

ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానానికి అనుగుణంగా వివరాలు సేకరిస్తాయని అన్నారు. గతంలో తెలంగాణలో ‘సకల జనుల సర్వే’ నిర్వహించినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని వేరు చేయడానికే అన్న అపోహలు తలెత్తాయని ఈ సందర్బంగాఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా ఆధార్ కార్డు కోసం కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరినప్పుడు కూడా చాలా మందికి పలు సందేహాలు వచ్చాయని గుర్తుచేశారు. కావున ప్రజల సందేహాలు నివృత్తి చేయడానికి త్వరలోనే భారీ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..