close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

రానున్న 40 నిమిషాల్లో పిడుగులు.. గుంటూరు జిల్లాకు ఆర్టీజీఎస్ హెచ్చరికలు

రానున్న 40 నిమిషాల్లో పిడుగులు.. గుంటూరు జిల్లాకు ఆర్టీజీఎస్ హెచ్చరికలు

Updated: Jun 8, 2019, 09:24 AM IST
రానున్న 40 నిమిషాల్లో పిడుగులు.. గుంటూరు జిల్లాకు ఆర్టీజీఎస్ హెచ్చరికలు
Representational image

అమరావతి: గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, అమరావతి మండలాల్లో నేడు ఉదయం వర్షం కురిసే అవకాశంతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 40 నిమిషాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ గుంటూరు జిల్లా వాసులను అప్రమత్తం చేసింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద తలదాచుకోకుండా సురక్షితమైన భవనాల్లో ఉండాల్సిందిగా ఆర్టీజీఎస్‌ సూచించింది.

గతంలో అనేక సందర్భాల్లో ఆర్టీజీఎస్ హెచ్చరించిన విధంగానే పలు ప్రాంతాల్లో పిడుగులుపడిన దాఖలాలు ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందా అని ఆయా ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.