Gorantla Madhav Controversy: గోరంట్ల మాధవ్ విషయంలో టీడీపీకే షాకిచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి

Gorantla Madhav Nude Video Controversy: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వైరల్ అయిన అనంతరం వైసీపీపై టీడీపీ విమర్శల దాడి పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల రాసలీలలు అధికం అయ్యాయంటూ టీడీపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Last Updated : Aug 8, 2022, 07:50 PM IST
Gorantla Madhav Controversy: గోరంట్ల మాధవ్ విషయంలో టీడీపీకే షాకిచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి

Gorantla Madhav Nude Video Controversy: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వైరల్ అయిన అనంతరం వైసీపీపై టీడీపీ విమర్శల దాడి పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల రాసలీలలు అధికం అయ్యాయంటూ టీడీపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మాధవ్ న్యూడ్ వీడియో నిజమైనదేనా లేక ఫేకా అనేది తేలిన తర్వాతే అతడిపై చర్యలు తీసుకునేదా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని సజ్జల స్పష్టంచేశారు. అరగంటలోనో లేక గంటలోనో రిపోర్ట్ వస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వాస్తవానికి రిపోర్టు ఇంకా రాలేదు.. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది అని సజ్జల అన్నారు.

ఏడేళ్లయినా.. చంద్రబాబు కేసులోనే ఇంకా క్లారిటీ లేదన్న సజ్జల...... 
గోరంట్ల మాధవ్ తనను వేధించారు అంటూ ఏ మహిళ నుండి ఫిర్యాదు రాలేదన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహరం కంటే గతంలో చంద్రబాబు అడ్డంగా బుక్కయిన ఓటుకు నోటు కేసే పెద్దదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో ఉన్నది చంద్రబాబు వాయిసేనా ? కాదా ? అనేది ఇంకా తేలలేదనే విషయం గుర్తుంచుకోండి అంటూ టీడీపీకి చురకలు అంటించారు. ఏడేళ్ల పాత కేసు అయిన ఓటుకు నోటు కేసులోనే చంద్రబాబు వాయిస్‌పై ఇంకా క్లారిటీ రానప్పుడు.. తాజాగా గోరంట్ల మాధవ్ కేసులో రకరకాల ఆరోపణలు చేయడంలో అర్థమే లేదన్నారు. 

వెంటిలేటర్‌పై టీడీపీ..
ప్రజల ఆదరణ ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని.. ఆ విషయం తెలియకే టీడీపీ నేతలు మళ్లీ మేమే అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీపై నమ్మకం పోతున్న తరుణంలో కార్యకర్తలను కాపాడుకునేందుకు తెలుగు దేశం పార్టీ ఏవేవో జిమ్మిక్కులు చేస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు ఫొటో (Chandrababu Naidu meets PM Modi) దిగిన తర్వాతే టీడీపీలో ధైర్యం పెరిగినట్టుందని తెలుగు దేశం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read : CM JAGAN: టీడీపీని షేక్ చేస్తున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్.. అక్కడ ఏం జరిగింది?

Also Read : CM Jagan Review: తమది రైతు ప్రభుత్వం..ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదన్న సీఎం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x