List of Cancelled Trains : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రద్దయిన రైళ్ల వివరాలను వెల్లడించింది. రైల్వే సిబ్బంది, లోకో పైలట్ల కొరత కారణంగానే రైలు సర్వీసులను రద్దు చేశారనే ప్రచారాన్ని సీపీఆర్వో రాకేష్ ఖండించారు. కరోనాతో తీవ్రతతో పాటు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో లేని మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో మున్ముందు మరిన్ని రైళ్లు కూడా రద్దవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రద్దయిన రైళ్ల వివరాలివే :
మేడ్చల్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-చిట్టాపూర్, కాజీపేట-సికింద్రాబాద్, హైదరాబాద్-కాజీపేట, బీదర్-కలబుర్గి, కలబుర్గి-బీదర్, నడికుడి-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-నడికుడి, మేడ్చల్-ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్, తిరుపతి-కట్పడి, గుంతకల్-డోన్, గూటీ-డోన్ తదితర రైళ్లు రద్దయ్యాయి.
కరోనా మహమ్మారి కారణంగా @SCRailwayIndia ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. pic.twitter.com/Y5IF8kNGsD
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 21, 2022
రైళ్ల రద్దుతో సామాన్య ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఫస్ట్ వేవ్ సమయంలో రైళ్లన్నీ (Indian Railway) రద్దు చేసినట్లే ఇప్పుడు కూడా రైళ్లను రద్దు చేయబోతున్నారా అన్న ఆందోళన వారిలో రేకెత్తుతోంది. ముఖ్యంగా వలస కార్మికులు రైళ్ల రద్దుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇప్పటికే చాలామంది వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. గతంలో ఉన్నట్టుండి లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడి వాళ్లు అక్కడే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వలస కార్మికులు ముందుగానే అప్రమత్తమవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook