దక్షిణ మధ్య రైల్వే: ఐటీఐ ఉంటే చాలు, రైల్వేలో 4103 ఉద్యోగాలు

ఉద్యోగార్థులకు శుభవార్త. భారీ రిక్రూట్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Last Updated : Jun 28, 2018, 08:18 PM IST
దక్షిణ మధ్య రైల్వే: ఐటీఐ ఉంటే చాలు, రైల్వేలో 4103 ఉద్యోగాలు

ఉద్యోగార్థులకు శుభవార్త. భారీ రిక్రూట్ మెంట్ కు దక్షిణ మధ్య రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 20వ తేదీ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 4 వేల 103 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. పదో తరగతి, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే చాలా దరఖాస్తుకు అర్హులు. రిజర్వేషన్ల వారీగా ఎస్సీలకు 616, ఎస్టీలకు 308, ఓబీసీలకు 1,107, జనరల్ కేటగిరీ వారికి 2,072 పోస్టులను కేటాయించారు.

ఏసీమెకానిక్‌ విభాగంలో 249 పోస్టులు, కార్పెంటర్‌ విభాగంలో 16, డీజిల్‌ మెకానిక్‌ విభాగంలో 640, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 18, ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 871, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 102, ఫిట్టర్‌ విభాగంలో 1,460, మెషినిస్ట్‌ విభాగంలో 74, ఎంఎండబ్ల్యూ విభాగంలో 24, ఎంఎంటీఎం విభాగంలో 12, పెయింటర్‌ విభాగంలో 40, వెల్డర్‌ విభాగంలో 597 పోస్టులు ఉన్నాయి. జూన్ 18 నాటికి 15-24 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌‌లైన్‌ ద్వారా జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంది. జనరల్/ఓబీసీలకు ఫీజు రూ.100గా ఉండగా, ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు.  మరిన్ని వివరాల కోసం http://www.scr.indianrailways.gov.in/ లో చూడవచ్చు.

Trending News