Chandra Babu Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడును సెప్టెంబర్ 9న శనివారం CID అరెస్టు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబుకు తరలించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక గదిని కేటాయించారు.
నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ చట్ట విరుద్ధమని.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నిరసనలతో పాటు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుండే రోడ్లపై నిరసనలు పాటిస్తున్నారు.
టీడీపీ బంద్ పిలుపుకు గుంటూరులోని ప్రైవేట్ విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. టీడీపీ బంద్ పిలుపుకు గాను.. పోలీసులు బస్ స్టేషన్ లలో భారీగా మొహారించారు. ఘటనలు జరగకుండా ఉండటానికి 144 సెక్షన్ అమలుతో పాటు భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
నారా చంద్రబాబును రిమాండ్ కు పంపినందుకు గాను.. బంద్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడలో బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయగా.. అంబటి వ్యాఖ్యలకు వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వ్యవస్థలను తప్పు దాటి పట్టించి చంద్రబాబు గారిని రిమాండ్ కు పంపించారని.. అంబటి చేసినన్ని అక్రమాలు ఎవరు చేయలేదని.. అవినీతిపై మాట్లాడే హాక్కు అంబటికి లేదని వెంకన్న వాపోయారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చి తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చంద్రబాబు నాయుడుని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ నిర్ణయం కారణంగా విజయవాడలో టీడీపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి.
Also Read: Chandrababu Case: చంద్రబాబు కేసులో కీలక పరిణామాలు, అటు కస్టడీ, ఇటు బెయిల్‌పై ఉత్కంఠ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook