Tirupati Stampede: తిరుమల ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ..సీఎం రేవంత్..

Tirupati Stampede: ఈ శుక్రవారం (10-1-2025)న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్త కోటికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక టిక్కెట్లు జారీ చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి టికెట్లు కౌంటర్లు తెరిచేలోపు తొక్కిసలాట జరిగి 6 గురు మృతి చెందడం తీవ్ర విషాదకరం. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 9, 2025, 01:27 PM IST
Tirupati Stampede: తిరుమల ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ..సీఎం రేవంత్..

Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడటం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన టీటీడీ ఉద్యోగులు.. టికెట్ ఇష్యూ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే విషయం స్పష్టమైంది. ఈ ఘటనలో 6 గురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసిందనే చెప్పాలి.

మొత్తంగా తిరుపతి తొక్కిసలాట ఘటన సర్వత్రా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎంతో భక్తి శ్రద్దలతో స్వామిని దర్శించుకుందామంటే ఇలాంటి ఘోరం జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించారనే వార్త తమను తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని మోడీ. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. అలాగే..క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని కోరారు.

తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలే ఉన్నారు. వారిని నర్సీపట్నంకి చెందిన బి.నాయుడు బాబు, విశాఖకు చెందిన రజిని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల, తమిళనాడు సేలంకి చెందిన మల్లిక మృతి చెందినట్లు గుర్తించారు. తొక్కిసలాటలో మరో 40 మందికి గాయాలయ్యాయి. అటు తిరుపతిలో జరిగిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ అధ్యక్షుడు సమీక్షిస్తున్నారు. 

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News