పోలవరం కోసం స్వయంగా రంగంలోకి దిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు

 ఏపీ ప్రజలకు జీవనరేఖ లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో అడ్డంకులు తొలగించేందుకు  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా రంగంలోకి దిగారు.

Last Updated : Jun 26, 2019, 06:39 PM IST
పోలవరం కోసం స్వయంగా రంగంలోకి దిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా చొరవ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర పర్యావరణశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విలువైన సూచన చేశారు. 

పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ఈ  పోలవరం ప్రాజక్టుపై అమల్లో ఉన్న ''స్టాప్ వర్క్ ఆర్డర్'' ఆదేశాలను మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేయాలని కేంద్ర పర్యావరణశాఖకు సూచించారు. 

దీనిపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేసినట్లు సమాచారం. పోలవరానికి పర్యావరణ శాఖ అడ్డుంకులు తొలిగిపోతే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి.

 

Trending News