10 rupees Coin: రూ.10 నాణెం పక్కా చెల్లుతుంది.. కేంద్రం క్లారిటీ!

Clarity on 10 rupees Coin: చాలా మంది పది రూపాయల కాయిన్‌ తీసుకోవాలంటే ఆలోచిస్తారు. దాదాపు ఆ కాయిన్‌ వద్దు అనే చెప్తారు. రూ.10 నాణెంపై ఇప్పటికీ చాలా మందికి అనుమానాలున్నాయి. అయితే దీనిపై కేంద్రం స్పష్టతను ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 02:50 AM IST
  • పది రూపాయల నాణెంపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
  • తాజాగా రూ. 10 నాణేలపై కేంద్రం క్లారిటీ
  • స్పష్టతను ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
  • పది రూపాయల నాణేలు చట్ట బద్ధమైనవని స్పష్టం
10 rupees Coin: రూ.10 నాణెం పక్కా చెల్లుతుంది.. కేంద్రం క్లారిటీ!

10 rupee coin in India: రూ.10 నాణెంను చాలా చోట్ల చెల్లదంటూ వెనక్కి ఇస్తుంటారు. కానీ ప్రభుత్వం, బ్యాంకులు రూ. 10 నాణెం చెల్లుంతుందని చెప్తూనే ఉన్నాయి. పది రూపాయల నాణెంపై ఆర్బీఐ కూడా ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా రూ. 10 నాణేలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనిపై స్పష్టతను ఇచ్చారు. దేశంలో చాలా ప్రాంతాల్లో పదిరూపాయల నాణేలు నకిలివి అని వాటిని అంగీకరించడం లేదంటూ రాజ్యసభలో ఎంపీ విజయ కుమార్‌ అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించి.. ఆర్బీఐ ద్వారా పంపిణీ అయిన వివిధ రకాల పది రూపాయల నాణేలు చట్ట బద్ధమైనవని తేల్చి చెప్పారు. 10 రూపాయల నాణేలను వివిధ సైజుల్లో, డిజైన్స్‌లలో ప్రభుత్వం ముద్రిస్తోందన్నారు. డబ్బుపరంగా జరిగే అన్ని లావాదేవీల్లో వీటిని ఉపయోగించవచ్చన్నారు. 10 రూపాయల నాణెం అంగీకరించడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయన్నారు. 

 ప్రజల్లో పది రూపాయల నాణేలపై అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉందని వివరించారు. కాగా 10 రూపాయల నాణేలు తీసుకోవడం లేదనే కారణంతో కేసులు ఫైల్‌ అయిన విషయం మాత్రం తమ దృష్టికి రాలేదని పంకజ్ చౌదరి వెల్లడించారు.

Also Read: Ratan Tata: రతన్‌ టాటాను 'ఛోటూ' అన్న అమ్మాయి.. వ్యాపార దిగ్గజం ఏం రిప్లై ఇచ్చారో తెలుసా?

Also Read: RBI Monetary Policy: బడ్జెట్ తర్వాత వడ్డీ రేట్లపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News