RBI Monetary Policy: బడ్జెట్ తర్వాత వడ్డీ రేట్లపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన

RBI Monetary Policy: మనీటరీ లివరేజ్ పాలసీపై రివ్యూలో భాగంగా కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.  కరోనా ముప్పు, ద్రవోల్బణం వంటి భయాల నేపథ్యంలో వరుసగా పదోసారి వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 12:20 PM IST
    • వడ్డీరేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన
    • వరుసగా పదోసారి వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగింపు
    • రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.35 శాతంగా ప్రకటన
RBI Monetary Policy: బడ్జెట్ తర్వాత వడ్డీ రేట్లపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన

RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై గురువారం కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీ రేట్లను మరో మారు యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. రెండు నెలలకు ఒకసారి చేసే మనీటరీ లివరేజ్ పాలసీపై రివ్యూ చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

కరోనా ముప్పు ఇంకా తొలగిపోని నేపథ్యంలో.. ద్రవ్యోల్బణం వంటి భయాల కారణంగా ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. 

వరుసగా పదోసారి..

అయితే కీలక వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగించడం ఇదే తొలిసారి కాదు. వరుసగా పదోసారి కీలక వడ్డీ రేట్లను కొనసాగించడం గమనార్హం. కరోనా సంక్షోభం మొదలైన 2020 ఏడాది మే నెలలో రెపో రేటును 4 శాతానికి కుదించినట్లు అప్పట్లో ప్రకటించిన ఆర్బీఐ.. దాన్నే పది దఫాలుగా కొనసాగిస్తూ వస్తుంది.  

Also Read: Flipkart Offers: రూ. 190లకే OPPO 5G స్మార్ట్ ఫోన్.. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

Also Read: Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News