Apple Electric Car సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో యాపిల్

 ఐఫోన్‌తో మోబైల్ రంగంలో తనదైన ముద్ర వేసిన యాపిల్ సంస్థ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో హైఎండ్ కార్లను తయారు చేస్తోంది. డ్రైవర్ అవసరం లేకుండా టెక్నాలజీ సాయంతో నడిచే హై ఎండ్ కార్‌ను రూపొందిస్తోంది.  ఈ సరికొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టుకు టైటాన్ అని పేరు పెట్టింది యాపిల్ కంపెనీ. కార్లో కూర్చున్న వ్యక్తి వాయిస్ కమాండ్ ఇస్తే చాలు కారు తనంతట తానే డ్రైవ్‌ చేసే విధంగా ఫుల్లీ ఆటోమేటెడ్ కారును తయారు చేస్తోంది యాపిల్.

Edited by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 11:56 AM IST
  • రోబోటిక్ టాక్సీ సేవలను అందుబాటులోకి
  • సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టుకు టైటాన్ అని పేరు
  • సిరి వాయిస్ కమాండ్ సాయంతో కారును ఆదేశాలు
Apple Electric Car సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో యాపిల్

Apple Electric Car :  ఐఫోన్‌తో మోబైల్ రంగంలో తనదైన ముద్ర వేసిన యాపిల్ సంస్థ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో హైఎండ్ కార్లను తయారు చేస్తోంది. డ్రైవర్ అవసరం లేకుండా టెక్నాలజీ సాయంతో నడిచే హై ఎండ్ కార్‌ను రూపొందిస్తోంది.  ఈ సరికొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టుకు టైటాన్ అని పేరు పెట్టింది యాపిల్ కంపెనీ. కార్లో కూర్చున్న వ్యక్తి వాయిస్ కమాండ్ ఇస్తే చాలు కారు తనంతట తానే డ్రైవ్‌ చేసే విధంగా ఫుల్లీ ఆటోమేటెడ్ కారును తయారు చేస్తోంది యాపిల్.

సిరి వాయిస్ కమాండ్ సిస్టమ్‌ ద్వారా ఈ కారు పనిచేయనుంది.  ఐఫోన్ ద్వారా సిరి వాయిస్ కమాండ్ సాయంతో కారును ఆదేశాలు ఇస్తే చాలు కారు తనంతట తానే డ్రైవ్ చేసుకునే విధంగా ఈ కొత్త మోడల్ తయారు చేస్తున్నారు. అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా ఈ హై ఎండ్ కారు పని చేస్తుందని యాపిల్ సంస్థ ప్రకటించింది. వాయిస్ కమాండ్ ఇస్తే చాలు కారు తనకు తానుగా డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఎక్కడ పార్క్ చేయమంటే అక్కడ పార్క్ చేస్తుంది. జస్ట్ వాయిస్ కమాండ్‌తో ఈ కారును పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. 

ఇక ఈ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో పని చేసే ఈ కారుకు అవసరమైన ఆటోపైలట్ చిప్‌ను అభివృద్ధి చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన కంపెనీతో ఆపిల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ12 బయోనిక్ ప్రాసెసర్‌ ద్వారా ఈ కారు పనిచేస్తుంది. ఇక కారు వేగం,  బ్రేకింగ్ తదితర అంశాలు అన్నీ వీడియో రూపంలో  కారులో అమర్చిన స్క్రీన్‌పై కనిపిప్తాయి. ముందు వెయ్యి కార్లను తయారు చేసి ఆ తర్వాత డిమాండ్‌ను పట్టి ఉత్పత్తి చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఇక ఈ కారులో వాడే సిరి వాయిస్ కమాండ్ టెక్నాలజీ మోబైల్‌ తో పాటు ఇతర సాధనాల్లో వాడే  టెక్నాలజీల కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని యాపిల్ సంస్థ ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పలు సంస్థలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​ను విజయవంతం చేసి, తమ సర్వీసులను మిగతా వారికంటే ముందే మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. యాపిల్‌తో పాటు  టెస్లా, హువాయి,  గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా సెల్ఫ్​ డ్రైవింగ్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. 2025 నాటికల్లా తన తొలి డ్రైవర్​లెస్​ కారును మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. 

also read   MTNL Recharge Plan: 49 రూపాయల రీఛార్జ్ తో 180 రోజుల వ్యాలిడిటీ!

also read  iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x