Apple Watch Ultra: అత్యంత చౌకగా యాపిల్ అల్ట్రా వాచ్, కేవలం 15 వందల రూపాయలే

Apple Watch Ultra: యాపిల్ ఉత్పత్తులంటే అందరికీ ఆసక్తి. క్రేజ్. ధర ఎక్కువ కావడంతో కాస్త వెనుకంజ వేస్తుంటారు. యాపిల్ డిజైన్, ఫీచర్ల కారణంగా అందరికీ ఇష్టమే. మరి ఇదే యాపిల్ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తే..ఇంకేమైనా ఉందా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2023, 01:34 PM IST
Apple Watch Ultra: అత్యంత చౌకగా యాపిల్ అల్ట్రా వాచ్, కేవలం 15 వందల రూపాయలే

యాపిల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్‌లకు డిమాండ్ ఎక్కువ. క్రేజ్ అంతకంటే అధికం. ధర ఎక్కువగా ఉండటంతో వెనుకంజ వేసేవారికి ఇదే గుడ్‌న్యూస్. మార్కెట్‌లో 90 వేల రూపాయలు పలికే యాపిల్ వాచ్ అల్ట్రా కేవలం 1500 రూపాయలకే లభిస్తుందంటే నమ్మలేకపోతున్నారా..ఆ వివరాలు మీ కోసం..

ఎక్కడ 90 వేల రూపాయలు..ఎక్కడ 1500 రూపాయలు. అంత భారీ తగ్గుదల ఎలా సాధ్యం, అంత తక్కువ ధరకు యాపిల్ వాచ్ అల్ట్రా ఎలా లభిస్తుందనే సందేహాలు ఎవరికైనా వస్తాయి. కానీ నిజమే. ఆ వివరాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవల్సిందే. ఇంత తక్కువ ధరకు యాపిల్ వాచ్ అల్ట్రా ఎలా లభిస్తుందనే సీక్రెట్ మీకు చెప్పాల్సిందే.

అసలు సంగతేంటంటే మార్కెట్‌లో 1500 రూపాయలకు లభిస్తున్న యాపిల్ వాచ్ అల్ట్రా అనేది ఒక రెప్లికా మోడల్. చూడ్డానికి అచ్చం ఆపిల్ వాచ్ అల్ట్రాలానే కన్పిస్తుంది. ఫీచర్లు పరిశీలించినప్పుడు మాత్రం అసలు సంగతి బయటపడుతుంది. వాస్తవానికి ఈ వాచ్‌లో ఒరిజినల్ ఆపిల్ వాచ్ అల్ట్రాలో ఫీచర్లు ఇచ్చినా..అవి పనిచేయవు. అందుకే యాపిల్ వాచ్ అల్ట్రాలా కన్పించే వాచ్ సొంతం చేసుకోవాలంటే ఇదే మంచి అవకాశం. ఫీచర్లు తప్ప మిగిలిందంతా సేమ్ టు సేమ్ యాపిల్ ఒరిజినల్ వాచ్‌లానే ఉంటుంది. 

ఫీచర్లు, సేఫ్టీ పరిగణలో తీసుకుంటే మాత్రం ఈ రెప్లికా మోడల్ కొనడం డబ్బులు వృధా తప్ప మరొకటి కానేకాదు. ఎందుకంటే ఇందులో ఇచ్చే హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు అసలు పనిచేయవు. అందుకే యాపిల్ వాచ్ అల్ట్రా రెప్లికాకు బదులు మార్కెట్‌లో లభించే ఇతర స్మార్ట్‌వాచ్‌లు తీసుకుంటే దీనికంటే బాగుంటుంది. రెప్లికా మోడల్‌పై డబ్బులు ఖర్చు చేయడం అనవసరం. 

Also read: Adani Group: ఆగని పతనం, నెలరోజుల్లోనే 11 లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News