Business Yantra: వ్యాపారంలో సక్సెస్‌కి వ్యాపార వృద్ధి యంత్రం.. దీనితో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే..

Business Yantra: రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా వ్యాపారంలో నష్టాలు తప్పట్లేదా.. వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుందా... అయితే వ్యాపార వృద్ధి యంత్రంతో మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 09:17 PM IST
  • వ్యాపార వృద్ధి యంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు
  • వ్యాపార వృద్ది యంత్రంతో వ్యాపారంలో ప్రయోజనాలు
  • వ్యాపార వృద్ధి యంత్రాన్ని ఎలా పూజించాలో తెలుసుకోండి
Business Yantra: వ్యాపారంలో సక్సెస్‌కి వ్యాపార వృద్ధి యంత్రం.. దీనితో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే..

Business Yantra: ఈరోజుల్లో జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు చాలా ముఖ్యం. కొంతమంది డబ్బు బాగా సంపాదించినా అది ఇంట్లో నిలవదు. మరికొందరు రాబడి ఎంతుంటుందో ఖర్చులు అంతే ఉంటాయి. ఇంకొందరికి వ్యాపారంలో అనుకోని నష్టాలు వెంటాడుతాయి. 'వ్యాపార వృద్ధి యంత్రం'ను వాడటం ద్వారా ఇలాంటి వాటన్నింటిని అధిగమించవచ్చునని చాలామంది నమ్ముతుంటారు.

వ్యాపార వృద్ధి యంత్రం :

వ్యాపార వృద్ధి యంత్రాన్ని రాగి, వెండి లేదా బంగారు రేకుపై లేదా రైన్‌స్టోన్‌లపై తయారు చేస్తారు. పురాణ గ్రంధాల ప్రకారం, శుభ ముహూర్తంలో స్ఫటికం లేదా బంగారు ఆకుపై యంత్రాన్ని తయారు చేయడం ద్వారా సకల శుభాలకు అది ద్వారం తెరుస్తుందని నమ్ముతారు. ఈ యంత్రాన్ని సరైన దిశలో ప్రతిష్టించి పూజించినప్పుడే పుణ్యఫలం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల పేదరికం దూరమై వ్యాపారంలో విజయం లభిస్తుంది.

వ్యాపారం లాభదాయకంగా ఉండేందుకు:

మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా మీ వ్యాపారంలో నష్టం ఉంటే, వ్యాపార వృద్ధి యంత్రాన్ని వాడితే మంచి ఫలితాలు పొందుతారని పండితులు చెబుతుంటారు. వ్యాపార వృద్ధి యంత్రం వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి, పేదరికాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యాపారంలో నష్టాలు వాటిల్లితే.. వ్యాపార వృద్ధి యంత్రాన్ని మీ షాపుకి తూర్పు లేదా ఉత్తర దిశలో అమర్చండి. అలాగే వ్యాపారంలో ఆర్థిక ఎదుగుదల కోరుకునే వ్యాపార వృద్ధి యంత్రం ముందు అగ్నిలో ఆవు పాలను సమర్పించాలి. దీనితో పాటు ప్రతిరోజూ లక్ష్మీసూక్తాన్ని పఠిస్తూ లక్ష్మీ దేవి మంత్రాన్ని జపించాలి.

వ్యాపార వృద్ధి యంత్రాన్ని ఎలా పూజించాలి :

శుక్ల పక్షంలోని బుధవారాలలో, శుభ ముహూర్తంలో వ్యాపార వృద్ధి యంత్రం ముందు కూర్చొని లక్ష్మీ మంత్రాన్ని పఠించడం ద్వారా సంపద పెరుగుతుంది. పూజ సమయంలో యంత్రంపై కాస్త పరిమళాన్ని అద్దాలి. అలాగే ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, ఊహలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌ని తక్షణమే ఈయూలో చేర్చుకోండి.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x