CIBIL Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి

CIBIL Score: బ్యాంకింగ్ వ్యవహారాలకు తప్పనిసరిగా చూసేది సిబిల్ స్కోర్. మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో రుణాలకు ఇది అంత ముఖ్యం. సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే జరిగే నష్టాలేంటి, సిబిల్ స్కోర్ మెరుగుపర్చుకునేందుకు సూచనలేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2023, 10:29 PM IST
CIBIL Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి

CIBIL Score: సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ రెండూ ఒకటే. ఓ వ్యక్తి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా లెక్కగట్టి ఆ వ్యక్తికి ఇచ్చే రేటింగ్ లాంటిది. మూడంకెల ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే రుణాల సౌలభ్యం, వడ్డీ రేట్లు అన్నీ ఆధారపడి ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం..

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌లో క్రెడిట్ హిస్టరీ కూడా ఉంటుంది. దీని ఆధారంగానే క్రెడిట్ స్కోర్ ఉంటుంది. క్రెడిట్ బ్యూరో నుంచి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది నిర్ధారితమౌతుంది. బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డులు, రుణాల వ్యవహారాల్లో సౌలభ్యం కోసం క్రెడిట్ స్కోర్ అనేది ఇస్తుంటారు. 300 నుంచి 900 మధ్య ఆ వ్యక్తి క్రెడిట్ హిస్టరీని బట్టి స్కోర్ ఉంటుంది. 300 అంటే ఏ మాత్రం మంచి స్కోర్ కాదు. 900 ఉందంటే అది అత్యుత్తమమైందని అర్ధం. అంటే రుణాలు చాలా ఈజీగా అందుతాయి. వడ్డీ రేటు కూడా సౌలభ్యంగా ఉంటుంది. 

రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలంటే సిబిల్ స్కోర్ బాగుండాలి. ఎక్కువ మంది రుణ దాతలు బ్యాంకులైనా లేదా ఫైనాన్సింగ్ సంస్థలైనా సరే 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే రుణాలు సులభంగా ఇస్తుంటాయి. మీ సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే..రుణ దరఖాస్తులు రద్దు కావచ్చు. సిబిల్ స్కోర్ మెరుగుపర్చుకునేందుకు కొన్ని సూచనలు ఉన్నాయి.

మీరు ఏదైనా రుణం తీసుకున్నప్పుడు లేదా క్రెడిట్ కార్డు తీసుకుని ఉంటే..చెల్లింపు సకాలంలో ఉండేట్టు చూసుకోవాలి. గడువు తేదీ తరువాత చెల్లిస్తే ఆ ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై పడుతుంటుంది. సకాలంలో చెల్లిస్తే మాత్రం సిబిల్ స్కోర్ మెరుగుపడుతుంది. క్రెడిట్ కార్డు మొత్తం పరిమితిని పూర్తిగా వినియోగించకుండా ఉంటే మంచిది. లేకపోతే సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. క్రెడిట్ లిమిట్ దాటకుండా చూసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ ఉపయోగం అనేది సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది. 

Also read: SBI Rules: మీ ఎస్బీఐ ఎక్కౌంట్ నుంచి 295 రూపాయలు ఎందుకు కట్ అవుతున్నాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News