SBI Rules: మీ ఎస్బీఐ ఎక్కౌంట్ నుంచి 295 రూపాయలు ఎందుకు కట్ అవుతున్నాయో తెలుసా

SBI Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కౌంట్ హోల్డర్లకు అలర్ట్ ఇది. మీ ఎక్కౌంట్‌లో 295 రూపాయలు కట్ అయ్యాయా, ఎందుకు డెబిట్ అయ్యాయో తెలుసుకోవాలనుంటే ఆ వివరాలు మీకోసం. అసలు బ్యాంకు మీ డబ్బులు ఎందుకు కట్ చేస్తుందో కూడా తెలుసుకోండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2023, 02:07 PM IST
SBI Rules: మీ ఎస్బీఐ ఎక్కౌంట్ నుంచి 295 రూపాయలు ఎందుకు కట్ అవుతున్నాయో తెలుసా

దేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐ దేశవ్యాప్తంగా శాఖల్ని కలిగి ఉంది. దేశంలో అత్యధికులు ఎస్బీఐ ఖాతానే కలిగి ఉంటారు. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విషయమై ఎస్బీఐకు కొన్ని నిబంధనలున్నాయి. ఆ నిబంధనల్ని పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐ. దేశవ్యాప్తంగా వేలాది బ్రాంచీలున్నాయి. అందుకే ప్రతి భారతీయుడికి ఎస్బీఐ ఒక బ్యాంకర్. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల ద్వారా గ్రామీణ, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలందిస్తోంది. బ్యాంకింగ్ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది శాఖల ద్వారానే కాకుండా అత్యధికులు ఖాతా కలిగి ఉండటం ద్వారా ప్రధాన బ్యాంకింగ్ పార్టనర్ అయింది. అయితే ఎస్బీఐ కస్టమర్ల ఖాతా నుంచి 295 రూపాయలు కట్ చేస్తుందని..ఎందుకనేది తెలియడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ఏ విధమైన లావాదేవీలు జరపకపోయినా బ్యాంకు ఒక్కోసారి 295 రూపాయలు డిడక్ట్ చేయడంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటే ఈ సమాధానం మీ కోసమే.

సేవింగ్ ఎక్కౌంట్ల నుంచి డబ్బులు కట్ అవడమనేది నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ఆబ్లిగేషన్ల కారణంగా జరుగుతుంటుంది. సింపుల్‌గా నాచ్ అంటారు. నాచ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు చెల్లింపుల్ని సులభతరం చేసేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఇంకా సులభంగా అర్దం కావాలంటే మీ ఎక్కౌంట్లలోంచి ఈఎంఐ చెల్లింపుల కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. మీరు తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ నిర్ణీత తేదీన మీ బ్యాంకు ఎక్కౌంట్ నుంచి కట్ అవుతుంది. అంటే ప్రతి నెల 5వ తేదీన ఈఎంఐ చెల్లింపు ఉంటే..ముందు రోజు నాటికి మీ ఎక్కౌంట్‌లో సంబంధిత రుసుము ఉండాలి.

మీరు మీ ఎక్కౌంట్‌లో నిర్ణీత లేదా నిర్ధారిత బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ 250 రూపాయలు పెనాల్టీ విధిస్తుంది. ఈ పెనాల్టీపై  18 శాతం జీఎస్టీ ఉంటుంది. అంటే 250 రూపాయలపై 18 శాతం అంటే 45 రూపాయలు. రెండూ కలిపితే 295 రూపాయలు కట్ అవుతాయి. అందుకే ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటే నిర్ధారిత తేదీ నాటికి నిర్ధారిత నగదు మీ ఎస్బీఐ ఎక్కౌంట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే ఇలా ప్రతిసారీ 295 రూపాయలు కట్ అవుతుంటాయి.

Also read: March 31 Deadline: మార్చ్ 31 లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News