Credit Card New Rule: క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు, ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్పులు ఇవే

Credit Card New Rule: మీకు క్రెడిట్ కార్డు ఉందా..మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే ఈ సూచన మీ కోసమే. ఏప్రిల్ 2024 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ నిబంధనలు మారాయి. ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2024, 06:00 PM IST
Credit Card New Rule: క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు, ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్పులు ఇవే

Credit Card New Rule: ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు సంబంధించి డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ నిబంధన మారింది. ఇకపై లాంజ్ యాక్సెస్ పొందాలంటే క్రెడిట్ కార్డు హోల్డర్లు కనీసం 10 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లాంజ్ యాక్సెస్ సౌకర్యాల్లో ఫుడ్, వైఫై, ఎయిర్‌పోర్ట్ లాంజ్, స్నానం, విశ్రాంతి వంటివి ఉంటాయి. అందుకే ఈ నిబంధన కీలకంగా మారనుంది.

ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొత్త నిబంధన 1 ఏప్రిల్, 2024 నుంచి అమల్లోకి రానుంది. లాంజ్ యాక్సెస్ కావాలనుకుంటే డిసెంబర్ 21, 2023 నుంచి మార్చ్ 20, 2024 మధ్యలో నిర్ణీత మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం క్రెడిట్ ఉంటే సరిపోదు..క్రెడిట్ కార్డుతో నిర్ణీత మొత్తంలో ఖర్చు చేస్తేనే ఈ సౌకర్యాలు వర్తించేలా బ్యాంకులు నిబంధన పెడుతున్నాయి. 
ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధన మార్చడంతో  Yes Marquee, Yes Select, Yes Reserve, Yes First Preferred, Yese Bank Elite కార్డులపై ప్రభావం పడనుంది. మరోవైపు ఎస్ బ్యాంక్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాటాను 9.5 శాతానికిపెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతించాక ఎస్ బ్యాంక్ షేర్లలో 13 శాతం వృద్ధి కన్పించింది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్ విలువ 25.70కు చేరుకుంది. 

మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో కీలక మార్పులు చేయనుంది. ఈ మార్పులు కూడా ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కలిగినవారు గత త్రైమాసికంలో కనీసం 35 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే వచ్చే త్రైమాసికంలో ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ పొందాలంటే గత త్రైమాసికంలో 35 వేల రూపాయలు క్రెడిట్ కార్డుపై ఖర్చు చేసుండాలి. ఇక యాక్సిస్ బ్యాంక్ కూడా యాక్సిస్ విస్తారా ఇన్‌ఫినిట్ క్రెడిట్ కార్డులో వచ్చిన మార్పులు వెల్లడించింది. మొదటి సంవత్సరానికి వర్తించే గోల్డ్ స్టేటస్ ప్రయోజనం రెండవ ఏడాదికి వర్తించదని తెలిపింది. 

Also read: Virus Threat to iOS Users: ఐఫోన్ యూజర్లను వెంటాడుతున్న వైరస్, ఖాళీ అవుతున్న బ్యాంక్ ఎక్కౌంట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News