Google vs EU Regulatory Dispute: గూగుల్ వర్సెస్ యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ వివాదం ముదురుతోంది. యాపిల్ మార్కెట్‌ను ఎందుకు విస్మరిస్తున్నారంటూ గూగుల్ ఈయూ నియంత్రణ సంస్థలపై మండిపడుతోంది.
ఆండ్రాయిడ్ మార్కెట్‌లో గూగుల్ సంస్థ(Google)ఆధిపత్యం ప్రదర్శిస్తూ విపరీతమైన లాభాలు ఆర్జించిందని, యూజర్ల భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించిందనే ఆరోపణలు గూగుల్ సంస్థపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై 2018లో ఏకంగా 35 వేల కోట్ల జరిమానాను గూగుల్ సంస్థకు విధించింది ఈయూ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ సంస్థ(EU Anti trust Regulatory). మూడేళ్ల అనంతరం ఈ వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై వాదప్రతివాదనలు ఈయూ ఉన్నత న్యాయస్థానంలో జరిగాయి. ఐదుగురు న్యాయమూర్తులతో ఉన్న ధర్మాసనంలో(EU Court) ఐదు రోజులపాటు విచారణ జరగనుంది. తమపై వచ్చిన ఆరోపణలకు గూగుల్ గట్టిగానే స్పందించింది. ఆండ్రాయిడ్ మార్కెట్‌తో పాటు యాపిల్ మార్కెట్ కూడా ఉన్నప్పుడు..ఈయూ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ సంస్థ యాపిల్ సంస్థను ఎందుకు విస్మరించిందని ప్రశ్నించింది. అంతేకాకుండా తాము నైతిక విలువలు పాటించామని..యూజర్లకు, డివైజ్ మేకర్లకు ఏ విధమైన నష్టం లేకుండా యాప్ మార్కెట్‌లో టాప్ పొజీషన్‌కు చేరుకున్నామని గూగుల్ వెల్లడించింది. తమపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఈయూ రెగ్యులేటరీ అథారిటీలు..యాపిల్ (Apple)విషయంలో మాత్రం కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నాయని గూగుల్ తరపు న్యాయవాది ఆరోపించారు. ప్లేస్టోర్, యాప్ మార్కెట్‌లోనే కాకుండా ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పోలిస్తే అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉన్న యాపిల్‌ను ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు.
అయితే ఈ వ్యవహారంపై యాపిల్ సంస్థను(Apple) లాగడం సరికాదని ఈయూ తరపు న్యాయవాది స్పందించారు. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే యాపిల్ మార్కెట్(Apple Market)తక్కువని గుర్తు చేశారు. గూగుల్ సెర్చ్ నుంచి మొదలుకుని యాప్‌స్టోర్ ఇలా ప్రతి ఒక్కటి బలవంతపు ఒప్పందాలతో చేయించుకుందని ఈయూ వాదించింది. జర్మన్‌కు చెందిన గిగాసెట్ కమ్యూనికేషన్స్ మాత్రం గూగుల్ సంస్థను సమర్ధిస్తోంది. ఈయూ రెగ్యులేటరీ నిర్ణయం వల్ల వ్యాపారానికి నష్టం కలుగుతోందని తెలిపింది. మొత్తానికి గూగుల్ వర్సెస్ ఈయూ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ అధారిటీ మధ్య వాద ప్రతివాదనలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి.
Also read: Forbes Ranking: మారిన కుబేరుల జాబితా, మరోసారి అగ్రస్థానానికి చేరిన ఎలాన్ మస్క్, ఫోర్బ్స్ జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook