Flipkart iPhone SE Sale: రూ.40,000 విలువైన iPhone ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.13 వేలకే విక్రయం!

Flipkart iPhone SE Sale: ఈ - కామర్స్ దిగ్గజ సంస్థ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు మంత్ ఎండ్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ సేల్ ద్వారా దాదాపు రూ. 40 వేల విలువ కలిగిన Apple ఐఫోన్ SEను ఇప్పుడు కేవలం రూ.13 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 02:24 PM IST
Flipkart iPhone SE Sale: రూ.40,000 విలువైన iPhone ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.13 వేలకే విక్రయం!

Flipkart iPhone SE Sale: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం మంత్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులోకి వచ్చాయి. Apple, Samsung, Xiaomi, Oppo వంటి అనేక కంపెనీల స్మార్ట్ ఫోన్స్ ను అతి తక్కువ ధరకే మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ద్వారా Apple iPhone SE వేరియంట్ ఇప్పుడు అతి తక్కువ ధరకే లభించనుంది. కేవలం రూ. 12,799 ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Apple iPhone SE ఆఫర్స్

Apple iPhone SE 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర మార్కెట్లో రూ. 39,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ.10,601 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ రూ. 29,299 వద్దకు చేరుతుంది. ఈ భారీ తగ్గింపుతో పాటు అనేక బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

మీరు ఫోన్ కొనుగోలు చేసేందుకు మీరు IDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీరు 10 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా అత్యధికంగా వేయి రూపాయలను కస్టమర్లు ఆదా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.28,299కి కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు వీలుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా.. మీ మొబైల్ కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 15500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ను మీరు పూర్తిగా పొందినట్లైతే.. యాపిల్ ఐఫోన్ SE స్మార్ట్ ఫోన్ ను మీరు రూ. 12,799 ధరకే కొనుగోలు చేయవచ్చు.  

Also Read: Flipkart Samsung F22: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.49 లకే శాంసంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్ కొనేయండి!

Also Read: Google Maps ద్వారా ఇంట్లో కూర్చొని రోజుకు రూ.3,700 సంపాదించవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News