Gold : ఈ బంగారాన్ని అసలు కొనవద్దు.. 24, 22, 18 క్యారెట్స్ గోల్డ్ మధ్య ఏంటి తేడా? ఏది కొంటే బెస్ట్?

Gold Purity: బంగారానికి..మహిళలకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ  చెప్పక్కర్లేదు. మనదేశంలో మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడుతారో అందరికీ తెలిసిందే. బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు..చాలా మంది దీన్ని శుభసూచికగా భావిస్తుంటారు. మరి బంగారం కొనుగోలు చేసే ముందు 24,22,18 క్యారెట్స్ బంగారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఎలాంటి బంగారం కొనుగోలు చేయాలనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు.   

Written by - Bhoomi | Last Updated : Oct 28, 2024, 01:08 PM IST
Gold : ఈ బంగారాన్ని అసలు కొనవద్దు.. 24, 22, 18 క్యారెట్స్ గోల్డ్ మధ్య ఏంటి తేడా? ఏది కొంటే బెస్ట్?

Gold Purity: బంగారం అనేది ఒక విలువైన లోహం. దీన్ని రసాయనికంగా ప్రత్యేకమైన మూలకంగా పరిగణిస్తారు. నగల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో కూడా బంగారాన్ని ఉపయోగిస్తుంటారు. స్వచ్చమైన బంగారం పసుపు పచ్చ వర్ణంలో కొద్ది ఎర్రగా ఉంటుంది. దీనిని మేలిమి బంగారం అంటారు. 

బంగారం అంటే అందరికీ మక్కువే. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు బంగారాన్ని అలంకరణ కోసం మాత్రమే కాకుండా శుభసూచికగా భావించి కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది ఒంటినిండా బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పేరంటాల్లో ఎక్కువగా బంగారు ఆభరణాలు వేసుకుంటారు. ఎంత బంగారం ఎక్కువగా ఉంటే అంత ప్రెస్టేజీయస్ గా ఫీల్ అవుతుంటారు. 

ఇప్పుడు పెళ్లిళ్లు, పండగల సీజన్ మొదలైంది. ఈసమయంలో చాలా మంది తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం స్వచ్ఛతను కొలవడానికి క్యారెట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. క్యారెట్ ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. 24క్యారెట్స్ అంటే 99.90శాతం స్వచ్చమైన బంగారం అని అర్థం. ఇది బిస్కెట్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని నేరుగా జ్యువెల్లరీ తయారు చేయలేము. 

Also Read: Diwali 2024: దీపావళి రోజు బంగారం  కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు  

బంగారు ఆభరణాలు తయారు చేయాలంటే అందులో తప్పనిసరిగా రాగి కలపాల్సిందే. 22 క్యారెట్స్ బంగారం అంటే 91.67శాతం ప్యూరిటీ ఉంటుంది. 18 క్యారెట్స్ బంగారం వెండి, రాగి ఎక్కువగా ఉంటుంది. ఇందులో బంగారం 75శాతం ప్యూరిటీ ఉంటుంది. 18 క్యారెట్స్ బంగారం చిన్న చిన్న ఆభరణాలు, చెవి దిద్దులు తయారు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. 

ఇక 24క్యారెట్స్ బంగారం ధరరూ. 80వేలకు పైగా ఉంటుంది. ఇది 22 క్యారెట్స్ ధర రూ. 73వేల కంటే ఎక్కువ. 18 క్యారెట్స్ ధర రూ. 60వేలకు పైగా ఉంటుంది. బంగారం ప్యూరిటీని బట్టి ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే సాధారణ ప్రజలకు తక్కువ ధరకే బంగారం అందించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్స్ బంగారం తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. 

Also Read: Bank Holidays: నవంబర్‌ నెలలో కేవలం 12 రోజులే బ్యాంకులు పనిచేస్తాయి.. కారణం తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x