Housing Loan NOC: హోమ్ లోన్ తిరిగి చెల్లించడంతోనే పని అయిపోదు

Housing Loan NOC: హోమ్ లోన్ తీసుకున్న వాళ్లంతా బుద్దిగా హోమ్ లోన్ తిరిగి చెల్లిస్తారు కానీ.. హోమ్ లోన్ రీపేమెంట్ చేసిన తరువాత చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో మాత్రం తెలియక పొరపాటు చేస్తుంటారు. అవగాహన లేకపోవడం వల్లే వాళ్లు ఆ తప్పిదం చేస్తుంటారు. ఇంతకీ ఏంటా తప్పిదం అంటే... 

Written by - Pavan | Last Updated : Aug 24, 2023, 09:49 PM IST
Housing Loan NOC: హోమ్ లోన్ తిరిగి చెల్లించడంతోనే పని అయిపోదు

Things To Know About Housing Loan NOC: హోమ్ లోన్ అంటేనే ఆర్థికంగా జీవితానికి సరిపడ ఒక పెద్ద బాధ్యత. ఆర్థికంగా ఎంతో క్రమశిక్షణతో ఉంటే తప్ప హోమ్ లోన్ బాధ్యతను పూర్తి చేయడం అంత ఈజీ కాదు. సాధారణంగా హోమ్ లోన్ గడువు కనీసం 10 ఏళ్ల నుండి 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు పడుతుంది. అంతకాలంపాటు క్రమశిక్షణలో హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించి హోమ్ లోన్ ముగిసిన తరువాత తప్పనిసరిగా చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటి, ఎందుకు చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ లోన్ రీపేమెంట్ ప్రక్రియ పూర్తయిందని మీకు రుణం ఇచ్చిన బ్యాంకు వద్ద మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలా నిర్ధారించుకోవాలంటే.. మీరు రుణం తీసుకున్న బ్యాంక్ నుండి నో ఆబ్జెక్టివ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనినే షార్ట్‌కట్‌లో NOC అని కూడా పిలుస్తారు. ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుగోలు కోసం లోన్ తీసుకుంటే... ఆ లోన్ చెల్లింపులు పూర్తయిన తరువాత ఈ ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 

హోమ్ లోన్ ఎన్ఓసి అంటే ఏంటంటే..
మీకు హోమ్ లోన్ ఇచ్చిన బ్యాంకుకి ఇక మీరు చెల్లించాల్సింది అంటూ ఏమీ లేదని ఆ బ్యాంకు అందించే ఒక లీగల్ డాక్యుమెంట్ పేరే ఈ ఎన్ఓసి. ఇందులో హోమ్ లోన్ తీసుకున్న వారి పేరు, హోమ్ లోన్ వివరాలు, ఆస్తి చిరునామా, హోమ్ లోన్ క్లోజ్ చేసిన తేదీ వంటి వివరాలు పేర్కొని ఉంటాయి.

హోమ్ లోన్ ఎన్ఓసి ఎందుకు ముఖ్యం అంటే..
హోమ్ లోన్ తీసుకున్న వారు కొనుగోలు చేసిన ఇంటిపై మొదట యాజమాన్య హక్కులు పూర్తిగా హోమ్ లోన్ మంజూరు చేసిన బ్యాంకుకే ఉంటాయి. ఈ హోమ్ లోన్ తిరిగి చెల్లించాకే ఆ ఇంటి యాజమాన్యం హక్కులు హోమ్ లోన్ తీసుకున్న వారి పేరిట బదిలి అవుతాయి. అలా ఇంటి యాజమాన్యం హక్కు బదిలీ కావాలంటే.. బ్యాంకు వాళ్లు ఇచ్చిన ఈ ఎన్ఓసి తప్పనిసరిగా కావాల్సిందే. 

ఎవరికైతే బ్యాంకులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తాయో.. వారి సిబిల్ స్కోర్ కూడా మెరుగు పడుతుంది. అందుకు కారణం వారు తీసుకున్న లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే ఎన్ఓసి ఇస్తారు కనుక అది వారి క్రెడిట్ హిస్టరీ బాగుంది అని సూచించడమే. 

హోమ్ లోన్ తిరిగి చెల్లించిన తరువాత మళ్లీ ఏదైనా అవసరం కోసం లోన్ తీసుకోవాల్సి వస్తే.. అప్పడు మీ క్రెడిట్ హిస్టరీని సూచించే ఈ ఎన్ఓసి ఉపయోగపడుతుంది. 

హోమ్ లోన్ మొత్తం తిరిగి చెల్లించినప్పటికీ.. భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీ చెల్లింపుల్లో ఏవైనా వ్యత్యాసాలు కనిపించినా లేదా ఏదైనా వివాదాలు తలెత్తినా... అప్పుడు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.

ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు కోసం లోన్ తీసుకున్న వారు ఈ ఎన్ఓసి సర్టిఫికెట్ పొందడం వల్ల ఆ ఆస్తిపై పూర్తి యాజమాన్యం హక్కులు పొందిన వారు అవుతారు.

హోమ్ లోన్ రీపే చేసిన తరువాత NOC సర్టిఫికెట్ ఎలా పొందవచ్చంటే..

ఇది కూడా చదవండి : Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే

ఏ బ్యాంక్ నుండి అయితే హోమ్ లోన్ తీసుకున్నారో.. ఆ బ్యాంకుకు తాము రుణం మొత్తం తిరిగి చెల్లించడం జరిగింది అని ఆధారాలతో యుక్తంగా చెబుతూ ఒక లేఖ రాసి NOC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కొన్ని బ్యాంకులు కస్టమర్స్ సౌలభ్యం కోసం ఎలాంటి దరఖాస్తు లేకుండానే తమ బ్యాంక్ అధికారిక పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా NOC సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News