Maruti Brezza: మారుతి బ్రిజా కొనే ఆలోచన ఉందా..ఇదే మంచి అవకాశం, కేవలం 5 లక్షలే

Maruti Brezza: సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ సహకరించకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. కొంతమందైతే తమ బడ్జెట్‌కు అనుగుణంగా సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకుంటుంటారు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల ఎంపిక చాలా సులభమైపోయింది. దీనికోసం ప్రత్యేకంగా యాప్స్ సిద్ధమయ్యాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 2, 2023, 06:26 PM IST
Maruti Brezza: మారుతి బ్రిజా కొనే ఆలోచన ఉందా..ఇదే మంచి అవకాశం, కేవలం 5 లక్షలే

Maruti Brezza: దేశంలో ఇటీవల ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. మారుతి సుజుకి అందిస్తున్న ఎస్‌యూవీ బ్రిజాకు ఆదరణ పెరుగుతోంది. మీరు కూడా బ్రిజా కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. కేవలం 5 లక్షలకే బ్రిజాను సొంతం చేసుకునే అద్బుత అవకాశం. ఆశ్చర్యంగా ఉందా..ఈ వివరాలు మీ కోసం...

ఇప్పుడు మేం చెబుతున్న బ్రిజా కారు సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. రోడ్ ట్యాక్స్ ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో ముందే చెల్లించేస్తారు. మరోవైపు మీ బడ్జెట్‌కు అనుగుణంగా నచ్చిన కారు కొనవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్ల యాప్ కార్స్ 24లో మారుతి సుజుకి బ్రిజా కార్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. కేవలం 5 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. 

హర్యానా రిజిస్ట్రేషన్‌కు చెందిన మారుతి విటారా బ్రిజా 2017 వీడీఐ 4.96 లక్షలకే అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇప్పటి వరకూ 93 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ కారు ఢిల్లీలో అందుబాటులో ఉంది. 

ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కు చెందిన ఈ కారు 2016 మారుతి విటారా బ్రిజా వీడీఐ మేన్యువల్ వెర్షన్ 4.88 లక్షల రూపాయలుంది. డీజిల్ ఇంజన్ కారు ఫస్ట్ ఓనర్‌షిప్‌లో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 42,216 కిలోమీటర్లు ప్రయాణించింది. ఢిల్లీలో లభిస్తోంది.

ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కు చెందిన మరో బ్రిజా కారు 2018 రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా ఎల్డీఐ వెర్షన్ 5.49 లక్షలకే లభించనుంది. ఇది పెట్రోల్ ఇంజన్ మొదటి ఓనర్‌షిప్‌లో ఉంది. ఇప్పటి వరకూ 36,747 కిలోమీటర్లు తిరిగింది. ఇది కూడా ఢిల్లీలో అందుబాటులో ఉంది.

ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కు చెందిన మరో కారు 2018 మోడల్ మారుతి విటారా బ్రిజా జెడ్‌డీఐ ఏఎంటీ ఆటోమేటిక్ 6.85 లక్షలకు లభించనుంది. డీజిల్ ఇంజన్ కారు ఇప్పటి వరకూ 69,862 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది కూడా ఢిల్లీలో అందుబాటులో ఉంది.

Also read: Mahindra XUV300 W6: పనోరమిక్ సన్‌రూఫ్‌తో మహీంద్రా XUV300 SUV.. ధర, ఫీచర్స్‌, లాంచింగ్‌ తేది వివరాలు ఇవే..>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News