Maruti Jimny Offers: మారుతి సుజుకి కంపెనీల్లో ఎస్‌యూవీ వాహనాలు చాలా ఉన్న లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీగా ప్రాచుర్యం పొందింది మాత్రం మారుతి జిమ్నీనే. మహీంద్రా కంపెనీకు చెందిన థార్‌తో మారుతి జిమ్నీ పోటీ పడుతోంది. దసరా పురస్కరించుకుని మారుతి సుజుకి కంపెనీ జిమ్నీపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మరో పదిరోజులే ఉంటుంది.
మారుతి సుజుకి కంపెనీ లైఫ్‌స్టైల్ వాహనాల్లో కీలకమైంది మారుతి జిమ్ని. మహీంద్రా కంపెనీ థార్‌తో పోటీ పడే ఈ కారుని ఇండియాలో 5 డోర్ వెర్షన్‌లో లాంచ్ చేశారు. మారుతి జిమ్ని దేశంలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈసారి దసరా పురస్కరించుకుని కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ కారుపై ఏకంగా 1 లక్ష రూపాయల వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. జిమ్ని జేటా వెర్షన్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. జిమ్నీ శ్రేణిలో జేటా అనేది ఎంట్రీ లెవెల్ వాహనం. ఈ కారు మేన్యువల్ అయితే 12.74 లక్షలు కాగా, ఆటోమేటిక్ వెర్షన్ 13.94 లక్షలుంది. ఇందులో కూడా 1.5 లీటర్ కే15బి ఇంజన్ ఉంది. 4డబ్ల్యూడీ సెటప్‌తో ఉంటుంది.
జిమ్నీపై ఆఫర్లు
మారుతి సుజుకి జెటాపై ప్రస్తుతం 50 వేల రూపాయల వరకూ నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా మరో 50 వేల రూపాయలు ఎక్స్చేంజ్ లేదా లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకే వర్తిస్తుంది. అంటే మరో పదిరోజుల్లో ఈ డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. జెటా వేరియంట్ మేన్యువల్, ఆటోమేటిక్ రెండింటిపై ఈ ఆఫర్ లభిస్తుంది.
మారుతి జిమ్ని ప్రత్యేకతలు
మారుతి సుజుకి జిమ్ని జెటాలో స్టీల్ వీల్స్, 7.0 ఇంచెస్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 6 ఎయిర్ బ్యాగ్స్ , ఈఎస్పీ సహా చాలా ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి జిమ్ని లాంచ్ అయినప్పటి నుంచి ప్రతి నెలా 3 వేల యూనిట్లు విక్రయమౌతున్నాయి..
Also read: IMPS Transfer: ఐఎంపీఎస్‌లో అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షల వరకు సెండ్ చేయొచ్చు.. ఎలాగంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook