IMPS Transfer: ఐఎంపీఎస్‌లో అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షల వరకు సెండ్ చేయొచ్చు.. ఎలాగంటే..?

IMPS Transfer Online: ఐఎంపీఎస్‌లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షలు పంపించవచ్చు. త్వరలోనే ఈ అప్‌డేట్ రానుంది. అకౌంట్ హోల్డర్ పేరు, మొబైల్ నంబరు ఎంటర్ చేసి నగదు బదిలీ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 07:18 PM IST
IMPS Transfer: ఐఎంపీఎస్‌లో అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షల వరకు సెండ్ చేయొచ్చు.. ఎలాగంటే..?

IMPS Transfer Online: ఇటీవల యూపీఐ పేమెంట్స్ రావడంతో నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపించేందుకు ఎక్కువ మంది నెట్‌ బ్యాంకింగ్‌నే వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఐఎంపీఎస్‌లో ఎక్కువ అమౌంట్ ట్సాన్స్‌ఫర్ చేయాలంటే రిసీవర్ అకౌంట్‌ను యాట్ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆ అవసరం లేదు. బెనిఫిసియరీ అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షల వరకు నగదు బదిలీ చేసుకునే అవకాశం రానుంది. డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడానికి.. రిసీవర్ మొబైల్ నంబర్, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న పేరును నమోదు చేస్తే సరిపోతుంది. త్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఐఎంపీఎస్‌ ద్వారా డబ్బు పంపడానికి.. ఖాతాదారులు అకౌంట్ నంబర్‌తో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో అకౌంట్‌ను లింక్ చేయాలి. 

ఇలా యాడ్ చేసుకున్న తరువాత డబ్బును వెంటనే పంపించేందుకు అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఈ పద్ధతిని మార్చేందుకు ఎన్‌పీసీఈ సన్నాహాలు చేస్తోంది. అకౌంట్‌ను లింక్ చేసే ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. ఐఎంపీఎస్ వ్యవస్థను ఎన్‌పీసీఐ అందించిన చెల్లింపు ట్సాన్స్‌ఫర్ సేవ. ఈ పద్ధతి ద్వారా డబ్బును ఎప్పుడైనా ట్రాన్స్‌ఫర్ చేశారు.

ఐఎంపీఎస్ కొత్త సౌకర్యం కింద రిసీవర్ ధృవీకరించే సౌకర్యం తీసుకురానున్నారు. దీంతో నగదు బదిలీ చేసే వ్యక్తి ఎవరికి డబ్బులు పంపుతున్నారో వారి అకౌంట్‌ నంబర్ సరైనదేనా కాదా అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం కింద అకౌంట్ హోల్డర్ బ్యాంక్ వివరాలలో నమోదు చేసిన పేరును చెక్ చేసే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ పద్ధతి హోల్‌సేల్ నుంచి కార్పొరేట్ స్థాయికి విస్తరించనున్నారు. ప్రస్తుతం ఎంపీఎస్‌ కింద డబ్బును రెండు పద్ధతుల్లో సెండ్ చేసుకోవచ్చు.

అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేసి.. లబ్ధిదారుడి అకౌంట్‌ను సెండ్ చేస్తున్న అకౌంట్‌కు యాడ్ చేయాల్సి ఉంటుంది. మరో పద్దతిలో పంపించేందుకు ఒక అకౌంట్‌ నుంచి మరొక అకౌంట్‌కు అమౌంట్ పంపించేందుకు ఎంఎంఐడీని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: India Vs Bangladesh Updates: రాణించిన బౌలర్ల.. భారత్ టార్గెట్ 257..!   

ఇది కూడా చదవండి: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News