Pan-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ లింక్ ఎవరికి అవసరం లేదో తెలుసా

Pan-Aadhaar Link: ఆధార్ కార్డు వర్సెస్ పాన్‌కార్డ్. రెండూ నిత్య జీవితంలో కీలకమైన డాక్యుమెంట్లుగా మారుతున్నాయి. నగదు సంబధ లావాదేవీలకు పాన్‌కార్డు ఎంత అవసరమో, ఇతర పనులకు ఆధార్ కార్డు అంత ముఖ్యం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2024, 11:40 AM IST
Pan-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ లింక్ ఎవరికి అవసరం లేదో తెలుసా

Pan-Aadhaar Link: ఆధార్ కార్డు, పాన్‌కార్డు విస్తృత ఉపయోగాలు, ప్రయోజనాలను పరిగణలో తీసుకునే ప్రభుత్వం రెండింటినీ అనుసంధానం చేయాలని సూచిస్తోంది. పాన్‌కార్డ్-ఆధార్ కార్డ్ లింకింగ్ అనేది ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఇప్పటీకీ చాలామంది పాన్ కార్డును ఆధార్ కార్డులో లింక్ చేయలేదు. కొంతమందికి ఈ లింకింగ్ అవసరం లేదు కూడా. ఆ వివరాలు తెలుసుకుందాం..

వాస్తవానికి చాలాకాలం క్రితమే ప్రభుత్వం పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ట్యాక్స్ సంబంధిత పనులకు, ఆర్ధిక లావాదేవీలకు పాన్‌కార్డు అవసరం కాగా ఆధార్ కార్డు అతి ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర పనులకు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే చాలాసార్లు గడువు కూడా పొడిగించింది. అయితే కొంతమదికి పాన్‌కార్డు ఆధార్ కార్డు లింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. 

ఇప్పటికీ ఆధార్ కార్డుతో పాన్‌కార్డును లింక్ చేయని వాళ్లు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ చేయకుంటే డీయాక్టివ్ అయిపోతుంది. ఆర్ధిక లావాదేవీలు కూడా నిలిచిపోతాయి. పాన్‌కార్డు - ఆధార్ కార్డు అనుసంధానం కాకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు. బ్యాంకు లావాదేవీలకు కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు. చాలా రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాలు పనిచేయవు. పాన్‌కార్డు యాక్టివేట్ చేయాలంటే ఇన్‌కంకాట్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి జరిమానా ఫీజు 1000 రూపాయలు చెల్లించి ఇప్పుడైనా ఆ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 

అయితే కొంతమందికి మాత్రం పాన్‌కార్డు- ఆధార్ కార్డు లింక్ అవసరం లేదు. 80 ఏళ్లు దాటిన వ్యక్తులు ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ చేయాల్సిన అవసరం లేదు. భారత పౌరసత్వం లేని వ్యక్తులు కూడా పాన్‌కార్డు- ఆధార్ కార్డు లింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. 

Also read: Pre Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి, మందుల్లేకుండా నియంత్రించడం సాధ్యమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News