RBI Governor: క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఎప్పటికైనా ప్రశ్నార్థకమే - ఆర్బీఐ గవర్నర్

క్రిప్టో కరెన్సీ విషయంలో ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే జరిగింది. క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అంటూ పలు సార్లు ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే క్రిప్టో విలువ సన్నగిల్లుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రిప్టో విలువ దారుణంగా పడిపోతోంది. క్రిప్టోపై పెట్టుబడి పెట్టినవాళ్లలో చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. క్రిప్టో కరెన్సీ విషయంలో ఉన్న డొల్లతనం వల్లే తాము  ఇప్పటి వరకు క్రిప్టోపై సానుకూలంగా లేమని  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. అందుకే ప్రజలను క్రిప్టో విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నామని చెప్పారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 01:35 PM IST
  • క్రిప్టో కరెన్సీ విషయంలో డొల్లతనం
  • క్రిప్టో కరెన్సీ విషయంలో ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే జరిగింది
  • క్రిప్టోపై పెట్టుబడి పెట్టినవాళ్లలో చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు
RBI Governor: క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఎప్పటికైనా ప్రశ్నార్థకమే - ఆర్బీఐ గవర్నర్

RBI Governor: క్రిప్టో కరెన్సీ విషయంలో ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే జరిగింది. క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అంటూ పలు సార్లు ఆర్బీఐ హెచ్చరించినట్లుగానే క్రిప్టో విలువ సన్నగిల్లుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రిప్టో విలువ దారుణంగా పడిపోతోంది. క్రిప్టోపై పెట్టుబడి పెట్టినవాళ్లలో చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. క్రిప్టో కరెన్సీ విషయంలో ఉన్న డొల్లతనం వల్లే తాము  ఇప్పటి వరకు క్రిప్టోపై సానుకూలంగా లేమని  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. అందుకే ప్రజలను క్రిప్టో విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నామని చెప్పారు.

దేశంలోని పలువురు ఆర్థిక వేత్తలతో పాటు ఆర్బీఐలోని ఉన్నతాధికారులు ఊహించినట్లుగానే క్రిప్టో ఇప్పుడు దివాళా తీస్తోందని ఆయన అన్నారు. డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోకు నిజమైన విలువ అంటూ ఏమీ లేదని చెప్పారు. డిజిటల్ ఫార్మట్‌లో ఉన్న క్రిప్టోను సవ్యంగా రెగ్యులేట్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఎన్ని వ్యవప్రయాలకు పడ్డ డిజిటల్ కరెన్సీని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని తెలిపారు. క్రిప్టో కరెన్సీ భారత ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందనే కేంద్ర ప్రభుత్వం కూడా అనుమితించలేదని శక్తికాంత్ దాస్ వివరించారు. క్రిప్టో పై ఎప్పటికప్పుడు కేంద్రంలోని పెద్దలకు వివరిస్తూనే ఉన్నామని వెల్లడించారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డే కూడా క్రిప్టో కరెన్సీలపై అపనమ్మకాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో క్రాష్ అయిన తర్వాత పలు దేశాల్లోని ఆర్థిక వేత్తలు క్రిప్టోపై అపనమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ మళ్లీ క్రిప్టో ఇప్పుడిప్పడే లాభాల బాటలో పడుతోంది. ఈపాటికే చాలా నష్టపోయిన పెట్టుబడిదారులకు ఇది కాస్తో కూస్తో ఊరట కలిగిస్తోంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటల్ 2.09 శాతం పెరుగుదల నమోదు చేసింది. దీంతో క్రిప్టో  1.29 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం వరల్డ్ మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ధర రూ. 24.5 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ వాటా 0.09 శాతం పెరుగుదలతో 44.60 శాతానికి చేరింది. మరోవైపు రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం కూడా కాస్తో కూస్తో పెరుగుదల నమోదు చేస్తోంది. దీని ధర  ఇప్పుడు రూ.1.64 లక్షల వద్ద నమోదు అయింది.

also read  Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. రూ.12 వేలకే అందుబాటులో!

also read Mini AC Cooler: అమెజాన్ లో రూ.6 వేలకే అందుబాటులో పోర్టబుల్ ఏసీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x