Realme Launched New Mobiles: రియల్​మీ నుంచి ఒకేసారి రెండు ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయిగా!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ ఫోన్ల తయారీ కంపెనీ రియల్​మీ రియల్​మీ జీటీ నియో 2టీ పేరుతో ఈ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..??  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 09:00 PM IST
  • రియల్​మీ జీటీ నియో 2టీ, రియల్​ మీ క్యూ3ఎస్​ లాంచ్ చేసిన రియల్​మీ
  • ఆకట్టుకుంటున్న ఫీచర్స్ మరియు ధరలు
  • చైనాలో మాత్రమే విడుదలైన ఈ మొబైల్స్ త్వరలోనే గ్లోబల్, భారత్​లోకి రానున్నాయి
Realme Launched New Mobiles: రియల్​మీ నుంచి ఒకేసారి రెండు ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయిగా!

Realme Launched New Mobiles: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ ఫోన్ల తయారీ కంపెనీ రియల్​మీ గేమింగ్ లవర్స్​ కోసం మరో అదిరే మోడల్​ను విడుదల చేసింది. రియల్​మీ జీటీ నియో 2టీ పేరుతో ఈ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. దీనితోపాటే క్యూ సిరీస్​లో రియల్​ మీ క్యూ3ఎస్​ మోడల్​ను కూడా విడుదల చేసింది. ఈ రెండు మోడళ్ల ధర, ఫీచర్ల విశేషాలు ఇలా ఉన్నాయి..

రియల్​ మీ జీటీ నియో 2టీ ధర
రియల్​మీ జీటీ నియో 2టీ ధరను (8 జీబీ ర్యామ్​+ 128 జీబీ స్టోరేజ్​) 1,899 యువాన్​లుగా నిర్ణయించింది కంపెనీ. మన కరెన్సీ ప్రకారం చూస్తే దీని విలువ రూ.22,200. ఇదే మోడల్లో 8 జీబీ ర్యామ్​+ 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను 2,099 యువాన్​లుగా (రూ.25,500) ఉంచింది రియల్​మీ. 12 జీబీ ర్యామ్​+256 జీబీ స్టోరేజ్ ధర 2,399 యువాన్​లుగా (రూ.28 వేల పైమాటే) నిర్ణయించింది. ఈ మోడల్​ బ్లాక్​, వైట్ కలర్లలో లభించనుంది.

Also Read: Case Filed Against Mohan Babu:'మా' గొడవలో మోహన్ బాబు.. భద్రాద్రి కొత్తగూడెంలో కేసు నమోదు

ఫీచర్లు..
1) v6.43 అంగుళాల ఓఎల్​ఈడీ డిస్​ప్లే, 120 హెడ్జ్ రీఫ్రేష్​ రేట్​
2) మీడియాటెక్ డైమెన్సిటి 1200 ప్రాసెసర్​
3) ట్రిపుల్ రియర్​ కెమెరా (64 మెగా పెక్సెల్​ మెయిన్ కెమెరా+ 8 ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా+ 2 ఎంపీ మైక్రో లెన్స్)
4) 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ
5) 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
6) ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​ ఆధారంగా పని చేసే రియల్​మీ యూఐ 2.0

రియల్​మీ క్యూ3ఎస్​ ధర ఎంతంటే..
రియల్​ మీ క్యూ3ఎస్​ మోడల్​ను మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో విడుదల చేసింది రియల్​మీ. 6 జీబీ ర్యామ్​+ 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను 1,499 యువాన్లుగా (రూ.17,500) ఉంచింది కంపెనీ. ఇదే మోడల్​లో 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను 1,599 యువాన్లుగా (రూ.19 వేలు దాదాపు) నిర్ణయించింది. ఇందులో హై ఎండ్​ వేరియంట్​ (8 జీబీ ర్యామ్​+ 256 జీబీ స్టోరేజ్) ధరను 1,999 యువాన్​లుగా (రూ.23 వేల పైమాటే) నిర్ణయించింది. ఈ మోడల్​ బ్లూ, వైట్ కలర్లలో అందుబాటులో ఉంటుందని రియల్​మీ తెలిపింది.

Also Read: Case Filed Against Mohan Babu:'మా' గొడవలో మోహన్ బాబు.. భద్రాద్రి కొత్తగూడెంలో కేసు నమోదు

ఫీచర్లు..
1) 6.60 అంగుళాల డిస్​ప్లే
2) క్వాల్కమ్ స్నాప్​ డ్రాగన్​ 778 జీ (5జీ) ప్రాసెసర్​
3) ట్రిపుల్ రియర్​ కెమెరా (48 మెగా పిక్సెల్​ ప్రధాన కెమెరా+ 2 ఎంపీ మైక్రో లెన్స్​+ 2 ఎంపీ డెప్త్​ సెన్సార్​)
4) 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5) 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ (30 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​)
6) ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​ ఆధారంగా పని చేసే రియల్​మీ యూఐ 2.0

ఈ రెండు స్మార్ట్​ఫోన్లు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదలయ్యాయి. త్వరలోనే గ్లోబల్ మార్కెట్​తో పాటు.. భారత్​లోకి రానున్నాయి. దీనిపై కంపెనీ నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News