Petrol price hike: రేపటి నుంచి పెట్రోల్, డీజిల్​ ధరల బాదుడు?

Petrol price hike: పెట్రోల్, డీజిల్ ధరలు రేపటి నుంచి ఆకాశన్నంటున్నాయా? పెరుగుదలకు కారణాలు ఏమిటి? ధరలు ఎంత పెరగొచ్చు? అనే విషయంపై నిపుణుల విశ్లేషణ చూద్దాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 11:45 AM IST
  • రేపటి నుంచి పెట్రో బాదుడు?
  • అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో వృద్ధే కారణం
  • రూ.15-22 వరకు పెరిగే అవకాశం!
Petrol price hike: రేపటి నుంచి పెట్రోల్, డీజిల్​ ధరల బాదుడు?

Petrol price hike: నేటితో ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగియనుంది. 7వ దశలో ఉత్తర్​ ప్రదేశ్​లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 54 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్​ జరుగుతోంది. నేటి సాయంత్రంతో పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వనున్న నేపథ్యంలో రేపటి నుంచి పెట్రోల్​, డీజిల్ ధరల పెంపు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరగొచ్చు?

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సహా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్​ ఆయిల్ ధర బ్యారెల్​కు 125 డాలర్ల వరకు కూడా చేరింది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణంగా పెరుగుతుంటాయి. ఎందుకంటే.. దేశంలో అంతర్జాతీయ ధరలకు తగ్గట్లు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే విధానం అమలులో ఉంది.

మరి ప్రస్తుతం ఎందుకు పెరగటం లేదు?

ప్రస్తుతం క్రూడ్​ ఆయిల్ ధరలు రిరకార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్నా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో చమురు మార్కెటింగ్​ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో ప్రధాన చమురు మార్కెటింగ్ సంస్థలన్నీ ప్రభుత్వాధీనంలోనివే కావడంతో.. క్రూడ్​ ఆయిల్ ధరలు భారమైనా.. ఆ భారాన్ని వాహనాదారులకు బదిలీ చేయడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే భయాలే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. అయితే నేటితో ఎన్నికలు ముగియనున్నాయి. కాబట్టి రేపటి నుంచి అంతర్జాతీయ ముడి చమురు ధరలకు తగ్గట్లు దేశీయంగా కూడా పెట్రోల్​, డీజిల్ ధరలు పెరగొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంత పెరగొచ్చు?

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ముడి చమురు ధరల ప్రకారం.. దేశీయంగా పెట్రోల్​, డీజిల్ ధరలు రూ.15 నుంచి రూ.22 వరకు పెరగొచ్చని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ స్థాయిలో ధరలు ఒకే సారి పెంచితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావచ్చని.. అందుకే దశల వారీగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండవచ్చని చెబుతున్నారు.

Also read: Todays Gold Rate: 54 వేలకు చేరుకున్న బంగారం ధర, ఇంకెంత పెరుగుతుంది

Also read: TATA Play Discount Offers: ఛానెల్ ప్యాక్ ధరలు సగానికి తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News