RPF Jawan Fire: ముంబై-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్‌పీఎఫ్‌ జవాన్ కాల్పులు.. నలుగురు మృతి

Jawan Opens Fire on Jaipur Mumbai Train: రన్నింగ్ ట్రైన్‌లో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్‌ఐతోపాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 31, 2023, 11:38 AM IST
RPF Jawan Fire: ముంబై-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్‌పీఎఫ్‌ జవాన్ కాల్పులు.. నలుగురు మృతి

Jawan Opens Fire on Jaipur Mumbai Train: జైపూర్ నుంచి ముంబై వెళుతున్న రైలులో కాల్పుల ఘటన కలకలం రేపాయి. సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) ఉన్నారు. మహారాష్ట్రలోని బోరివలి నుంచి మీరా రోడ్ స్టేషన్ మధ్య పాల్ఘర్ సమీపంలో రైలులో వెళుతుండగా.. ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
జైపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12956)లోని బీ5 కోచ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఆర్‌పీఎఫ్‌ చేతన్.. ఎస్కార్ట్ ఇంఛార్జి ఏఎస్‌ఐ టికా రామ్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్‌ఐతోపాటు ముగ్గురు ప్రయాణికులు కూడా మరణించినట్లు ధృవీకరించారు. తన సీనియర్‌ను హత్య చేసిన తరువాత.. కానిస్టేబుల్ మరో బోగీకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిపిన అనంతరం దహిసర్‌ స్టేషన్‌ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడని.. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుడి టికా రామ్ మీనాను రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నివాసిగా గుర్తించారు. నిందితుడు చేతన్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందినవాడు. 

పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత కదులుతున్న రైలులో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపి.. చైన్ లాగి దహిసర్ స్టేషన్‌కు సమీపంలో రైలు నుంచి దిగినట్లు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్ అధికారుల సహాయంతో మీరా రోడ్ వద్ద పోలీసులు అతడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. పాల్ఘర్ ముంబై నుంచి 100 కి.మీ దూరంలో ఉంది. 

Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి  

Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News