Delhi acid attack case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ యాసిడ్ ఎటాక్ కేసులో ఫ్లిప్‌కార్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఘటనలో మైనర్ బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడికి ఆగ్రాకు చెందిన కెమికల్ కంపెనీ యాసిడ్ సరఫరా చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ స్పష్టంచేసింది. ఢిల్లీ పోలీసుల విచారణలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ వివరాలు బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా యాసిడ్ విక్రయించిన ఫ్లిప్‌కార్ట్, మీషో ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్స్ కి సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారి చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఫ్లిప్‌కార్ట్, మీషోలను ఆదేశించింది.
డిసెంబర్ 14న ఢిల్లీలోని ద్వరక ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్న 17ఏళ్ల మైనర్ బాలికపై బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. యాసిడ్ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటనను సుమొటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. నాలుగు వారాల్లోగా విచారణ జరిపించి నివేదిక అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ తో పాటు ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరిని ఆదేశించింది.
విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కి అనుగుణంగా బాధితురాలికి నష్టపరిహారం చెల్లిస్తున్నారా లేదా అనే వివరాలు కూడా ఆ నివేదికలో పొందుపర్చాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టంచేసింది. ఇలాంటి యాసిడ్ దాడి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యల వివరాలు ఏంటో తెలపాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.
ఇది కూడా చదవండి : Corporator Nephew Murder: పాతబస్తీలో పట్టపగలే కార్పొరేటర్ మేనల్లుడు దారుణ హత్య.. కారణం ఇదేనా..?
ఇది కూడా చదవండి : Karnataka Student Death: రాక్షసుడిగా మారిన ఉపాధ్యాయుడు.. విద్యార్థిని కొట్టి హత్య.. తల్లిపై రాడ్‌తో దాడి
ఇది కూడా చదవండి : Man Injects Wife With HIV: భార్యకు హెచ్ఐవి బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook