Aadhi Pinisetty Engagement: సునీల్ హీరోయిన్ తో నటుడు ఆది పినిశెట్టి నిశ్చితార్థం

Aadhi Pinisetty Engagement: ప్రముఖ కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ కలిసి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న్ వీరిద్దరూ.. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మార్చి 24న వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 07:00 PM IST
Aadhi Pinisetty Engagement: సునీల్ హీరోయిన్ తో నటుడు ఆది పినిశెట్టి నిశ్చితార్థం

Aadhi Pinisetty Engagement: కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ కలిసి కొన్నేళ్ల క్రితం 'మరకతమణి' అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ షూటింగ్ అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహలను నిజం చేస్తూ వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు. 

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ.. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మార్చి 24న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను వీరిద్దరూ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో వీరికి పలువురు సినీ ప్రముఖులు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aadhi Pinisetty (@aadhiofficial)

2015లో విడుదలైన 'యాగవరైనమ్‌ నా కక్కా' అనే తమిళ చిత్రంలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. ఆ తర్వాత 'మరగాధ నాణ్యం' (తెలుగులో 'మరకతమణి') మూవీ షూటింగ్ అప్పుడు పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఇప్పుడు ప్రణయానికి దారి తీసింది. నిక్కీ గల్రానీ తెలుగులో సునీస్ సరసన 'కృష్ణాష్టమి' చిత్రంలో నటించింది.  

ALso Read: Ananya Nagalla Photos: అందంతో మతిపొగ్గొట్టేస్తుంది 'వకీల్ సాబ్' పోరి!

Also Read: Mahesh Babu on RRR: థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ర్యాంపేజ్.. మూవీ టీమ్ కు సూపర్ స్టార్ సలామ్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x